కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) మహాలక్ష్మి పథకం(Mahalaxmi Scheme)లో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో(RTC Bus) ఉచిత ప్రయాణం కల్పించిన సంగతి తెలిసిందే. అయితే దీని ప్రభావం ఆటో డ్రైవర్ల(Auto Drivers)పై పడింది. దీంతో కుటుంబ పోషణ భారంగా మారి ఆటోడ్రైవర్లు రోడ్డెక్కే పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ నేపథ్యంలో బస్సుల్లో ఆటో డ్రైవర్లు భిక్షాటన చేస్తున్న ఘటన రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలుమార్లు ఆటోడ్రైవర్లు నిరసనలు తెలిపారు. ప్రభుత్వ అధికారులతోనూ సమావేశమయ్యారు. తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆటో డ్రైవర్లు భిక్షాటన చేస్తూ రేవంత్ సర్కార్ గుర్తించాలని కోరుతున్నారు.
సంక్రాంతి పండుగ వస్తున్నా తమ ఇళ్లల్లో ఆనందం కరువైందని ఆటోవాలాలు కన్నీరుమున్నీరవుతున్నారు. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో తాము ఉపాధి కోల్పోయామని ఆటో డ్రైవర్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజుకు రూ.100 కూడా సంపాదించలేక పోతున్నామని వాపోతున్నారు.
తమ ఆవేదనను ప్రభుత్వానికి చెప్పిన స్పందించలేదని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లు గడవాలంటే చాలా ఇబ్బందిగా మారడంతో వినూత్నంగా బిక్షాటన చేస్తున్నామని చెబుతున్నారు. మరి సంక్రాంతి పండుగకు రేవంత్ సర్కార్ ఆటోడ్రైవర్లను ఆదుకుంటుందో లేదో చూడాలి.