ఉత్తరప్రదేశ్‌లోని(Uttarpradesh) అయోధ్యలో(Ayodhya) ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన రామమందిరానికి(ram mandir) భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. బాలరాముడి(RAm lalla) దర్శనం కోసం విదేశాల నుంచి భక్తులు(Pilgrim) క్యూకడుతుండటం విశేషం. గత నెల 22న అయోధ్య రామమందిరం ప్రారంభమైన విషయం తెలిసిందే.
మరుసటి రోజు నుంచి అంటే జనవరి 23 నుంచి బాలక్‌రాముని దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు. కేవలం 11 రోజుల్లోనే 25లక్షల మంది భక్తులు బాలక్ రామ్‌ను దర్శించుకున్నారు. 11 రోజుల వ్యవధిలో హుండీ ఆదాయం రూ.11కోట్ల మేర వచ్చినట్లు ఆలయ ట్రస్టు అధికారి ప్రకాశ్ గుప్తా వెల్లడించారు. అందులో హుండీ ద్వారా రూ.8కోట్లు కాగా, చెక్కుల రూపంలో మరో రూ.3.5కోట్లు వచ్చాయి.
ఇందులో ఆన్‌లైన్ విరాళాలు కూడా ఉండటం గమనార్హం. మొత్తం 14 మంది హుండీ సొమ్మును లెక్కించారు. సీసీ కెమెరాలతో పర్యవేక్షించారు. భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో సందర్శన సమయాన్ని కూడా పెంచారు. ప్రతి రోజులు ఉదయం 6గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తులు ఆలయాన్ని సందర్శించుకోవచ్చని అధికారులు తెలిపారు.
ఇంతకు ముందు ఆలయ దర్శన వేళలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఉండేది. ప్రతీరోజు ఆలయ వేళలు ముగిసిన తర్వాత హుండీలలో నగదును లెక్కిస్తారు. దీనికోసం 14 మందిని ఆలయ కమిటీ నియమించింది. వారిలో 11మంది బ్యాంకు ఉద్యోగులు ఉండగా, మరో ముగ్గురు ఆలయానికి చెందినవారు ఉన్నారని ప్రకాశ్ గుప్తా వివరించారు.