మర్యాద పురుషోత్తముడు శ్రీరాముడు అయోధ్యలోని దివ్య మందిరంలో కోలువుదీరాడు. బాల రామయ్య విగ్రహ ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ప్రధాని మోడీ సహా అనేక మంది ప్రముఖులు.. ఈ ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవానికి హాజరయ్యారు. సరిగ్గా మధ్యాహ్నం 12.29.08 గంటల నుంచి 12.30.32 సెకన్ల వరకూ నిర్ణయించిన ప్రాణ ప్రతిష్ఠ ముహూర్తంలో క్రతువును పూర్తిచేశారు.
మ.12.06 గంటలకు అయోధ్య ఆలయ ప్రాంగణానికి ప్రధాని మోడీ చేరుకున్నారు
12.07 గంటలకు ఆలయం మెట్లు ఎక్కి లోపలికి ప్రవేశించారు
12.10 గంటలకు గర్భగుడి బయట పూజ ప్రారంభమైంది
12.13 గంటలకు పూజలో పాల్గొన్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
6 నిమిషాల పాటు గర్భగుడి బయట పూజా కార్యక్రమాలు జరిగాయి
12.16 గంటలకు గర్భగుడి ముఖద్వారం గడపకు మొక్కారు ప్రధాని మోడీ
12.17 గంటలకు గర్భగుడి లోపలికి అడుగుపెట్టారు
12.18 గంటలకు గర్భగుడి లోపల ప్రాణ ప్రతిష్ఠ పూజలు ప్రారంభమయ్యాయి
మ.12.29.08 గంటల నుంచి 12.30.32 గంటల మధ్య ప్రాణ ప్రతిష్ఠ క్రతువు నిర్వహించారు
12.33 గంటలకు అయోధ్య రామయ్య పాదాలకు మొక్కారు ప్రధాని మోడీ
మ.1.12 గంటల వరకు ప్రాణ ప్రతిష్ఠ పూజా కార్యక్రమాలు కొనసాగాయి
అభిజిత్ లగ్నంలో 84 సెకన్ల దివ్య ముహూర్తంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. రామ్ లల్లా విగ్రహం కళ్లకు ఉన్న వస్త్రాన్ని తొలగించాక.. బంగారంతో చేసిన కడ్డీతో శ్రీరాముడికి కాటుకను దిద్దారు. ప్రాణ ప్రతిష్ఠ తర్వాత 108 దీపాలతో బాల రామయ్యకు హారతినిచ్చారు. రామయ్య ప్రాణప్రతిష్ఠకు 7 వేల మంది అతిథులు.. లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. దీంతో అయోధ్యానగరి భక్తజనంతో కిక్కిరిసిపోయింది.