Telugu News » World Cup 2023 : వివాదాస్పదంగా మారిన బంగ్లా శ్రీలంక మ్యాచ్.. రాళ్లతో కొడతామని షకీబ్‌కు వార్నింగ్..!!

World Cup 2023 : వివాదాస్పదంగా మారిన బంగ్లా శ్రీలంక మ్యాచ్.. రాళ్లతో కొడతామని షకీబ్‌కు వార్నింగ్..!!

శ్రీలంక- బంగ్లాదేశ్ మ్యాచ్‌లో ఏంజెలో మ్యాథ్యూస్ ( Angelo Mathews) టైమ్​డ్​ ఔట్ (timed out) అవ్వగా ఇది కాస్త వివాదాస్పదంగా మారింది. ఇప్పటికే ఈ విషయంపై పలువురు మాజీలు స్పందించగా.. ఏంజెలో మ్యాథ్యూస్ సోదరుడు మాత్రం అతిగా స్పందించారు. షకీబ్​ మ్యాచ్​ ఆడేందుకు శ్రీలంకకు వస్తే అతనిపై రాళ్లదాడి తప్పదంటూ హెచ్చరించాడు.

by Venu

వన్డే వరల్డ్‌కప్‌-2023లో (World Cup) తాజాగా జరిగిన శ్రీలంక (Sri Lanka), బంగ్లాదేశ్‌ (Bangladesh) మ్యాచ్ లో జరిగిన సంఘటన రోజురోజుకు ముదురుతుంది. దిల్లీలోని అరుణ్​ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీలంక క్రికెటర్‌ ఏంజెలో మాథ్యూస్‌ అనూహ్య రీతిలో అవుటైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మాథ్యూస్‌​ సోదరుడు.. బంగ్లాదేశ్​ కెప్టెన్​ షకీబ్​ అల్​ హసన్​పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

శ్రీలంక- బంగ్లాదేశ్ మ్యాచ్‌లో ఏంజెలో మ్యాథ్యూస్ ( Angelo Mathews) టైమ్​డ్​ ఔట్ (timed out) అవ్వగా ఇది కాస్త వివాదాస్పదంగా మారింది. ఇప్పటికే ఈ విషయంపై పలువురు మాజీలు స్పందించగా.. ఏంజెలో మ్యాథ్యూస్ సోదరుడు మాత్రం అతిగా స్పందించారు. షకీబ్​ మ్యాచ్​ ఆడేందుకు శ్రీలంకకు వస్తే అతనిపై రాళ్లదాడి తప్పదంటూ హెచ్చరించాడు.

ఈ మ్యాచ్ లో మేము నిరాశకు గురయ్యాం. క్రీడాస్ఫూర్తి అంటే ఏమిటో తెలియని బంగ్లాదేశీ కెప్టెన్‌ మానవతా దృక్పథంతో ఆలోచింకపోవడం బాధాకరం అంటూ వ్యాఖ్యానించారు.మరోవైపు ఈ విషయంపై బంగ్లా కెప్టెన్ షకీబ్​ స్పందించాడు. తన బాధ్యతను తాను నిర్వహించానని.. ఈ విషయంలో వచ్చే విమర్శలకు బాధపడవలసిన అవసరం లేదని తెలిపారు..

అయితే తమ విజయంలో టైమ్డ్ ఔట్ కీలక సాయం చేసిందని తెలిపాడు. మరోవైపు శ్రీలంక బ్యాటర్​ ఏంజెలో మ్యాథ్యూస్ టైమ్​డ్​ ఔట్ విషయంలో ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి.

You may also like

Leave a Comment