బీఆర్ఎస్ (BRS) పై బీజేపీ (BJP) జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ (Bandi Sanjay) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కారు గ్యారేజికి పోతోందని ట్విట్టర్ టిల్లు (Twitter Tillu) నారాజ్ అవుతున్నాడని ఎద్దేవా చేశారు. నిజామాబాద్ (Nizamabad)ల చెల్లె ఓటమి ఖాయమైందని కేటీఆర్ ముందే ఆగమైతున్నాడన్నారు. కానీ ఏం ఫయిదా అని అన్నారు.
తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ దొంగ హామీల దొంగ జపం బట్టబయలైందని తెలిపారు. వరంగల్ డల్లాస్ కాలేదని తెలిపారు. కనీసం బస్టాండ్ కూడా రాలేదన్నారు. పైగా వరదలు, బురదలు బోనస్ అంటూ ఎద్దేవా చేశారు. నిజామాబాద్‌లో బోధన్ షుగర్ ఫ్యాక్టరీ తెరుచుకోలేదని చెప్పారు. 100 కుటుంబాలు కూడా బాగుపడలేదన్నారు. 100 ఏళ్లకు సరిపడా దోపిడీ మాత్రం జరిగిందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
ఆదిలాబాద్‌కు ఎయిర్ అంబులెన్స్‌లు రాలేదన్నారు. కనీసం అంబులెన్స్ పోయే తోవ కూడా వేయలేదన్నారు. గతి లేక గాల్లో కలిసిపోతున్న ప్రాణాలు మాత్రం ఎక్కువయ్యాయన్ని పేర్కొన్నారు. కరీంనగర్ లండన్ కాలేదన్నారు. వేములవాడకు ఏటా రూ.100 కోట్లు అందలేదన్నారు. కొండగట్టు అంజన్న ఘాట్ రోడ్డు గతి మారలేదన్నారు. గులాబీ కబ్జాకోర్లు, కీచకులు మాత్రం పెరిగారని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
లక్ష ఉద్యోగాలు రాలేదన్నారు. 3000 భృతి ఇవ్వలేదన్నారు. రైతుల ఆత్మహత్యల ఆగలేదన్నారు. పోడు పంచాయతీ పోలేదన్నారు. ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ కాలేదన్నారు. పదోన్నతులు పూర్తిగాలేదని గుర్తు చేశారు. కొత్త పీఆర్‌సీ అమలు నోచుకోలే , ఠంచనుగా జీతాలు రాలేదని వెల్లడించారు. తొమ్మిదేండ్లలో కల్వకుంట్ల ఖజానా మాత్రమే నిండిందన్నారు.
కల్వకుంట్ల భజనకారులకు కోట్ల కమీషన్లు అందాయి తప్ప కష్టపడి కొట్లాడిన తెలంగాణ ప్రజలకు ఒరిగిందేం లేదని తీవ్రంగా నిప్పులు చెరిగారు. తొమ్మిదేండ్లు గాడిద పండ్లు తోమి, ఇప్పుడు గాయి చేస్తే నమ్మేందుకు తెలంగాణ ప్రజలు అమాయకులు కాదన్నారు. దొంగ హామీలు, దగా మాటలు, దౌర్జన్య చేతలకు కాలం చెల్లిందని ఆయన స్పష్టం చేశారు. .