Telugu News » Bandi Sanjay : దమ్ముంటే ఆ విషయంపై కాంగ్రెస్ వైఖరేంటో రేవంత్ రెడ్డి చెప్పాలి…!

Bandi Sanjay : దమ్ముంటే ఆ విషయంపై కాంగ్రెస్ వైఖరేంటో రేవంత్ రెడ్డి చెప్పాలి…!

దేశాన్ని విభజించాలంటూ కాంగ్రెస్ ఎంపీ చేసిన వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.

by Ramu
bandi sanjays Slammed brs and congress

కాంగ్రెస్‌ (Congress)పై దేశ ద్రోహం కేసు పెట్టాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. దేశాన్ని విభజించాలంటూ కాంగ్రెస్ ఎంపీ చేసిన వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. టెర్రరిస్టులు, ఉగ్రవాదులు చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేతలు సపోర్ట్ చేస్తున్నారని ఆరోపించారు. ఇండియా కూటమి విచ్ఛినం అవుతుండటంతోనే కాంగ్రెస్ నేతలు ఇలాంటి పిచ్చి కూతలు కూస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

bandi sanjays Slammed brs and congress

కరీంనగర్‌కు బండి సంజయ్ ఏం చేశాడని వినోద్, పొన్నం ప్రభాకర్ తనను అడుగుతున్నారని ఫైర్ అయ్యారు. తాను ఏం చేశానో వినోద్ రావు వరంగల్ వెళ్ళేప్పుడు , పొన్నం హుస్నాబాద్‌లో తిరిగేప్పుడు చూడాలని అన్నారు. కరీంనగర్ లో ఆర్ఓబీ లేదా రైల్వే స్టేషన్‌ను చూస్తే తానేం చేశానో తెలుస్తందన్నారు.టాయిలెట్స్ నుంచి మొదలు స్ట్రీట్ లైట్స్ వరకు అన్నింటికీ కేంద్రమే నిధులిచ్చిందని చెప్పారు. ఎంపీ నిధుల నుంచి కరీంనగర్ జైలులో అంబులెన్స్ ,ల్యాబ్ అందించారని తెలిపారు.

స్మార్ట్ సిటీకి నిధులు ఎవరిచ్చారో లెక్కలు చూస్తే తెలుస్తందని తెలిపారు. సర్వేలో అంతా బీజేపీ ,మోడీ అని రావడంతో బీఆర్ఎస్ నేతలు కంగారు పడుతున్నారని వెల్లడించారు. ఎన్నికల కోసం బీఆర్ఎస్ ఎంపీ చేసిన సర్వే రిపోర్ట్ తన దగ్గరికి వచ్చిందని చెప్పారు. అయోధ్య రామాలయనికి అనుకూలంగా బీజేపీ ఉందని తెలిపారు. దమ్ముంటే కాంగ్రెస్ వైఖరి ఏంటో రేవంత్ రెడ్డి చెప్పాలని సవాల్ విసిరారు.

రామాలయానికి కాంగ్రెస్ వ్యతిరేకమైతే బయటికి వచ్చి ఆ విషయాన్ని చెప్పాలన్నారు. బీజేపీ రామాలయం కట్టిందని, అది తీసేసి బాబ్రీ మసీద్ కడతామని చెప్పే దమ్ము కాంగ్రెస్, బిఆర్ఎస్‌కు ఉందా? అని ప్రశ్నించారు. తాము హిందువులమని చెప్పుకోలేని కుహనా లౌకిక వాదులు బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అలాంటి వారితో జై శ్రీరామ్ అని బీజేపీ అనిపించిందన్నారు. అద్వానీకి భారత రత్న ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. క్విట్ ఇండియా ,ఎమర్జెన్సీ.,అయోధ్య పోరాటం లో పాల్గొన్న అద్వానీకి భారత రత్న ఇవ్వడం చాలా సంతోషాన్ని కలిగించిందన్నారు.

 

You may also like

Leave a Comment