తెలంగాణ సీఎం(Telangana CM)గా బాధ్యతలు చేపట్టనున్న ఎనుమల రేవంత్‌రెడ్డి(Revanth Reddy)కి సినీ నిర్మాత బండ్ల గణేష్ తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపారు. నిరంతరం తన శ్రేయస్సును కోరుకునే రేవంత్‌రెడ్డికి తెలంగాణ ముఖ్యమంత్రి పదవి దక్కడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని బండ్ల తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నానని అన్నారు.
ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి గతంలో బూర్గుల రామకృష్ణారావు 1952లో హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసారని ఇప్పుడు అదే జిల్లానుంచి ఎనుముల రేవంత్‌రెడ్డి 2023లో ముఖ్యమంత్రి అవుతున్నారని బండ్ల గణేష్ గుర్తుచేశారు. తెలంగాణ ప్రజలకు రేవంత్ సుపరిపాలన అందిస్తూనే అభివృద్ధికి పాటుపడతారని బండ్ల పేర్కొన్నారు.
మరోవైపు ఎక్స్(X) వేదికగా కొన్ని ట్వీట్లకు వచ్చిన కామెంట్లకు బంట్ల స్పందించాడు. ఓనెటిజన్ ‘అన్నా కేటీఆర్.. మా రేవంత్ రెడ్డిని చీప్ లీడర్ అని హేళన చేసి చేసి చాలా స్ట్రాంగ్ చేశారు.!! ఇపుడు చీఫ్ మినిస్టర్ అయ్యాడు..!! థ్యాంక్యూ’ అంటూ చేసిన ట్వీట్ కు బండ్ల గణేష్ రీ ట్వీట్ చేశాడు. ఇక ఎన్నికల ఫలితాల కంటే ముందే కాంగ్రెస్ గెలుస్తుందని రేవంత్ ముఖ్యమంత్రి అవుతారని బండ్ల జోస్యం చెప్పారు.
డిసెంబర్ 9న ప్రమాణస్వీకారం ఉంటుందని తాను మాత్రం 7నే ఎల్బీ స్టేడియంకు వెళ్లి పడుకుంటానని బండ్ల చమత్కరించాడు. ఈ మాటలను కూడా ఓ నెటిజన్ గుర్తుచేసాడు. నీకోసమే డిసెంబర్ 9న కాకుండా 7న నూతన సీఎం రేవంత్ ప్రమాణస్వీకార కార్యక్రమం పెట్టారన్న నెటిజన్ కామెంట్‌పై బండ్ల గణేష్ రియాక్ట్ అయ్యారు. ఇక తెలంగాణ కేబినెట్ మంత్రులు వీరేనంటూ తప్పుడు ప్రచారాలు చేయవద్దని బండ్ల గణేష్ కోరారు.
Anna LB Stadium lo dhagga undi chala Grand ga Pramana Sweekaram cheyinchu Anna Revanth Anna ni.. veelaithe Chiru Sir ni teeskoni ra Guest ga 🙏
— 🙁 🇦🇺 (@GMBTweetzzz) December 6, 2023