Telugu News » Congress : బీసీలకు ఆ 34 కావాలి, భట్టిని కోరిన నేతలు

Congress : బీసీలకు ఆ 34 కావాలి, భట్టిని కోరిన నేతలు

బీసీ సామాజిక వర్గానికి చెందిన కీలక నేతలైన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ పేర్లు లేవనే చర్చ మొదలైంది.

by Prasanna
Batii

 

కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత భట్టి విక్రమార్క (Batti Vikramarka) తో కాంగ్రెస్ పార్టీ (Congress Party) లోని బీసీ నేతలు (BC Leaders) సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా టికెట్ల కేటాయింపుపై చర్చించారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో బీసీలకు రెండు సీట్లు ఇవ్వాలని భట్టి విక్రమార్కకు వినతిపత్రం అందజేశారు.

Batii

ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ అంటూ ఒక జాబితా లీక్ అయ్యింది. ఇందులో బీసీ సామాజిక వర్గానికి చెందిన కీలక నేతలైన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ పేర్లు లేవనే చర్చ మొదలైంది. ఫస్ట్ లిస్టులో ఎస్సీ, ఎస్టీ, బీసీల పేర్లే ఫస్ట్ లిస్టులో ఉంటాయని గతంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారని, కానీ ఇప్పుడు వారి పేర్లు లేక పోవడం బీసీ నేతల ఆగ్రహానికి కారణమైంది.

దీనిపైన భట్టి విక్రమార్కతో చర్చించి, ఆయనకు వినతి పత్రం బీసీ నాయకులు అంద చేశారు. తెలంగాణా రాష్ట్ర కాంగ్రెస్ ఓబీసీల తరపున తమ విన్నపాలు అధిష్టానం దృష్టికి తీసుకుని వెళ్లాలని, బీసీల నుంచి ఎమ్మేల్యే టిక్కెట్లు ఆశిస్తున్న వారికి న్యాయం జరిగి, అది కాంగ్రెస్ పార్టీని విజయ తీరాలకు చేర్చేందుకు దోహదపడాలని ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతానికి అనుగుణంగా ఉదయ్ పూరి డిక్లరేషన్ సాక్షిగా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ నియోజకవర్గానికి కనీసం రెండు చొప్పున 34 సీట్లు తప్పనిసరిగా కేటాయింపు జరిపేలా చూడాలని అందులో కోరారు. ఓబీసీలకు 34 సీట్లు కేటాయించడంలో మీరే బాధ్యత తీసుకోవాలని భట్టి విక్రమార్కను కోరారు.

You may also like

Leave a Comment