ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానంలోని నడకదారిలో చిన్నారిపై చిరుత దాడిచేసిన ఘటన తెలిసిందే. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని శ్రీశైలం ఆలయ కమిటి,అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు.
శ్రీశైలం(Srisailam)లోని శిఖరేశ్వర ప్రాంతాలలో సంచరిస్తున్న ఎలుగుబంటిని ఆగస్టు 18 అర్ధరాత్రి 1 గంట సమయంలో బోను సాయంతో అటవీశాఖా (Department of Forestry) అధికారులు బంధించారు. చిక్కిన ఎలుగుబంటిని ఇవాళ ఉదయం వెలుగోడులోని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు అటవీశాఖ అధికారులు.
ఆత్మకూరు(Athmakuru)ప్రాజెక్ట్ టైగర్ డిప్యూటీ డైరెక్టర్(Deputy Director)అలెన్ చాంగ్ టేరాన్(Allen Chang Teran)ఆదేశాల మేరకు శ్రీశైలం రేంజర్ నరసింహులు,సెక్షన్ ఆఫీసర్ మదన్ పర్యవేక్షణలో రెస్క్యూట్ టీం,స్థానిక అటవీ శాఖ సిబ్బంది కలిసి ఎలుగుబంటిని వెలుగోడు దట్టమైన అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.
తిరుమలలో జరిగిన ఘటనతో శ్రీశైలంలో పునరావృతం కాకుడదని ముందస్తు చర్యలలో భాగంగా ఎలుబంటిని బంధించి సురక్షిత ప్రాంతానికి తరలించామని అధికార యంత్రాంగం తెలిపింది.