Telugu News » భగవద్గీత, ఖురాన్, బైబిల్ లాంటిదే.. మేనిఫెస్టో: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాస్యం

భగవద్గీత, ఖురాన్, బైబిల్ లాంటిదే.. మేనిఫెస్టో: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాస్యం

బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మేనిఫెస్టో అంటే తమకు భగవద్గీత, ఖురాన్, బైబిల్ లాంటిదని అభివర్ణించారు.

by Mano
Bhagavad Gita, Quran, Bible are same.. Manifesto: BRS MLA Dasyam

బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మేనిఫెస్టో అంటే తమకు భగవద్గీత, ఖురాన్, బైబిల్ లాంటిదని అభివర్ణించారు. తనకు బీఫామ్ ఇచ్చినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తాను 50వేల మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.

Bhagavad Gita, Quran, Bible are same.. Manifesto: BRS MLA Dasyam

బీఆర్ఎస్ మేనిఫెస్టోలో సీఎం కేసీఆర్ పేదల సంక్షేమానికి మరోసారి ఎన్నో పథకాలు అందించారని చెప్పారు. అంబేడ్కర్ ఆలోచనా విధానంతో అభివృద్ధిలో దూసుకెళ్తున్నామన్నారు. తెలంగాణ సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టి, అతిపెద్ద అంబేడ్కర్ విగ్రహాన్ని నెలకొల్పామని చెప్పారు.

కరోనా కాలంలో పశ్చిమ నియోజకవర్గంలో 46వేల కుటుంబాలను ఆదుకున్నామని గుర్తుచేశారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు కష్టకాలంలో అండగా ఉన్నానన్నారు.

ప్రజలకు ఏనాడూ కనిపించని నాయకులు ఎన్నికలు దగ్గర పడుతుండడంతో వస్తున్నారని ఎద్దేవా చేశారు. మతతత్వ పార్టీలు ప్రజలు ఆదరించరని అన్నారు. అభివృధ్ధే ధ్యేయంగా అందరి సలహాలను స్వీకరిస్తూ ముందుకెళ్తున్నట్లు తెలిపారు.

You may also like

Leave a Comment