ఎన్నో అబద్ధాలు ఆడి.. రెండు సార్లు కేసీఆర్ (KCR) అధికారంలోకి వచ్చారని సీఎల్పీ (CLP) నేత భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. ఇంటికో ఉద్యోగం పేరుతో గతంలో మోసం చేసిన కేసీఆర్ మళ్ళీ అదే మోసంతో ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని విమర్శించారు.
అబద్ధాల హామీలతో మోసం చేసే కుటుంబాన్ని తరిమి కొట్టాలని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. మేనిఫెస్టో పేరుతో మరోసారి తెలంగాణ (Telangana) ప్రజలను దగా చేయడానికి బీఆర్ఎస్ కుట్ర చేస్తోందని ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్రం సాధించింది దొరల కోసం కాదని, ప్రజల కోసమని భట్టి అన్నారు. బీఆర్ఎస్ బీజేపీ (BJP)తో చేతులు కలిపి బీ టీమ్‌గా మారిందని, బీఆర్ఎస్కు ఓటు వేయడం బీజేపీకి వేయడమేనని, ఈ మందలో ఎంఐఎం కూడా చేరిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు తోడు దొంగలే అన్న భట్టి హైదరాబాద్ నగరంలోని చాలా భూములను అమ్మేసుకున్నారని ఆరోపించారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని.. ఆరు గ్యారెంటీ స్కీమ్‌లను ఆరు నెలల్లో అమలు చేస్తామని తెలిపారు. కాగా ఇప్పటి వరకు కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన జరుగలేదని.. మీడియాలో వస్తున్న కథనాలు నమ్మవద్దని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.