ఓ భక్తుడు ఆలయంలో గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్(Madhya Pradesh)లోని మెహర్ జిల్లా(Mehar District)లో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. రక్తపు మడుగులో పడి ఉన్న భక్తుడిని చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన లల్లారామ్(37) మెహర్ జిల్లాలోని శారద మాతా ఆలయానికి సోమవారం రాత్రి చేరుకున్నాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో లల్లారామ్ గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
రక్తపు మడుగులో పడి ఉన్న లల్లారామ్ను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న మెహర్ పోలీసులు మృతదేహాన్ని, భక్తుడికి సమీపంలో లభ్యమైన కత్తిని స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే, లల్లారామ్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సివుంది. ఈ ఆలయానికి ప్రతీ వందల మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారని తెలిపారు. అయితే, గతంలో ఈ ఆలయంలో కొంత మంది భక్తులు తమ నాలుకలను కోసుకునేందుకు యత్నించినట్లు స్థానికులు చెబుతున్నారు.