పార్లమెంట్ ఎన్నికల వేళ బీజేపీ పార్టీ(BJP PARTY)కి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి అనారోగ్యం(Health Issue)తో మృతి చెందారు. ఈ విషయం తెలియడంతో పలువురు బీజేపీ పెద్దలు సంతాపం వ్యక్తం చేశారు.
కర్ణాటక బీజేపీ ఎంపీ, మాజీ కేంద మంత్రి వి. శ్రీనివాస ప్రసాద్ (76)(V.Srinivasa Prasad) అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారు జామున మృతి చెందారు. ఆయనకు భార్య, ముగ్గురు కూతుర్లు ఉన్నారు. అయితే, శ్రీనివాస ప్రసాద్ బీజేపీ పార్టీ గుర్తుపై చామనగర్ నియోజకవర్గం నుంచి ఆరుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు.
అదేవిధంగా మైసూరులోని నంజన్ గుడ్ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1976లో బీజేపీ చేరిన శ్రీనివాస ప్రసాద్ 1979లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీజేపీలో చేరడానికి ముందు కొంత కాలం పాటు జేడీయూ, సమతా పార్టీల్లోనూ వివిధ హోదాల్లో పనిచేశారు.
1999-2004 వరకు అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిమంత్రిగా ఉన్న సమయంలో కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార పంపిణీ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి 2013లో ఎమ్మెల్యేగా కూడా గెలుపొందారు. కొన్ని అనివార్య కారణాల వలన మళ్లీ 2016లో భారతీయ జనతా పార్టీలో చేరి 2019లో తిరిగి చామరాజనగర్ నుంచి ఎంపీగా గెలుపొందారు.
ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న టైంలో ఆయన ఒక్కసారిగా అనారోగ్యానికి గురయ్యారు. ఆస్పత్రిలో చేరి గత కొద్దిరోజులుగా చికిత్స పొందుతుండగా, పరిస్థితి విషమించి తెల్లవారుజామున తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు వెల్లడించారు.