మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత సినిమాలు చేయలేదు. తర్వాత మళ్లీ రీఎంట్రీ ఇచ్చి ఖైదీ నెంబర్ 150 సినిమా చేశారు. ఏకంగా 100 కోట్లని కలెక్ట్ చేసి షాక్ అయ్యేలా చేశారు తర్వాత అదే ఉత్సాహం తో పలు సినిమాలు చేసిన అంతగా లాభాలని తీసుకురాలేదు. ముఖ్యంగా సైరా నరసింహారెడ్డి సినిమాకి విపరీతంగా నష్టాలు వచ్చాయి. మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లో అతి పెద్ద డిజాస్టర్ సినిమాలు గురించి ఇప్పుడు చూద్దాము.
ఆచార్య సినిమా చిరంజీవి కెరియర్ లో పెద్ద డిజాస్టర్ అని చెప్పచ్చు పైగా రాంచరణ్ నిసినిమాలో పెట్టి కూడా ఫ్లాప్ ని కొట్టారు. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా కూడా ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. మెగాస్టార్ కెరియర్ లోనే భారీ ఫ్లాప్ గా మిగిలిపోయింది ఈ సినిమా. 2004లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో శ్యాంప్రసాద్ రెడ్డి నిర్మించిన అంజి మూవీ కూడా చిరంజీవికి చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఎంఎస్ ఆర్ట్ మూవీస్ పథకం పై ఈ సినిమాని రూపొందించారు. ఈ సినిమా కూడా సక్సెస్ కాలేదు. అలానే శంకర్ దాదా జిందాబాద్ కూడా చిరంజీవి కెరియర్ లో డిజాస్టర్ గానే మిగిలిపోయింది. బాలీవుడ్ సినిమా రీమేక్ ఇది ఈ సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది.
Also read:
చిరంజీవి హీరోగా వచ్చిన మృగరాజు సినిమా కూడా డిజాస్టర్ అయింది గుణశేఖర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. బిగ్ బాస్ సినిమా కూడా చిరు కెరియర్ లో పెద్ద మైనస్ అయింది. ఈ సినిమా కూడా చిరు కెరియర్ లో అపజయాన్ని తీసుకు వచ్చింది. ఎస్పీ పరశురామ్ సినిమా కూడా భారీ ఫ్లాప్ అయ్యింది. చిరంజీవి హీరోగా వచ్చిన స్టువర్టుపురం పోలీస్ స్టేషన్ సినిమా కూడా చిరంజీవికి డిజాస్టర్ ని ఇచ్చింది ఇవే కాకుండా లంకేశ్వరుడు, రాజా విక్రమార్క, యుద్ధ భూమి సినిమాలు కూడా ఫ్లాప్ గానే ఉండిపోయాయి. చక్రవర్తి సినిమా కూడా కష్టాలనే తీసుకువచ్చింది. ఆరాధన, త్రినేత్రుడు, కిరాతకుడు, జేబుదొంగ, రుద్రనేత్ర, చాణక్య శపథం, చిరంజీవి, ధైర్యవంతుడు, శివుడు శివుడు శివుడు ఇలా కొన్ని సినిమాలు చిరంజీవి కెరీర్ లో ఫ్లాప్ లు అయ్యాయి.