Telugu News » BJP : బీజేపీ మూడో జాబితా పై ఫోకస్.. కుదిరిన జనసేన పొత్తు..!!

BJP : బీజేపీ మూడో జాబితా పై ఫోకస్.. కుదిరిన జనసేన పొత్తు..!!

బీజేపీ (BJP) మాత్రం ప్రచారంలో కాస్త వెనక పడినట్టు రాజకీయ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. తెలంగాణలో పెండింగ్ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక పై బీజేపీ దృష్టి పెట్టింది. ఇదివరకే రెండు జాబితాలు విడుదల చేసిన బీజేపీ.. మూడో జాబితా ప్రకటనపై ఫోకస్ పెట్టింది.

by Venu

అసెంబ్లీ ఎన్నికల (Assembly-Election) సమరంలో కాంగ్రెస్ (Congress) బీఆర్ఎ (BRS) హైరేంజ్ స్పీడ్ లో దూసుకుపోతున్నాయని జనం అనుకుంటున్నారు. అభ్యర్థులను ప్రకటించిన దగ్గరి నుండి.. వారి గెలుపు కోసం కృషి చేస్తున్నాయి.. మరో అడుగు ముందుకేసిన బీఆర్ఎస్ ప్రచారంలో జోష్ పెంచింది. నేతల చేరికల పై ప్రత్యేక దృష్టి నిలిపింది.

ఇక బీజేపీ (BJP) మాత్రం ప్రచారంలో కాస్త వెనక పడినట్టు రాజకీయ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. తెలంగాణలో పెండింగ్ స్థానాల అభ్యర్థుల ఎంపిక పై బీజేపీ దృష్టి పెట్టింది. ఇదివరకే రెండు జాబితాలు విడుదల చేసిన బీజేపీ.. మూడో జాబితా ప్రకటనపై ఫోకస్ పెట్టింది.

ఈ మేరకు బుధవారం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇంట్లో టీ బీజేపీ కోర్ కమిటీ భేటీ కానుంది. అమిత్ షాతో పాటు కిషన్ రెడ్డి, డీకే అరుణ ఈ సమావేశంలో పాల్గొననున్నారు. కాగా ఈ సమావేశంలో టీ బీజేపీ తుది జాబితాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారని వార్తలు వస్తున్నాయి.. ఈ పరిస్థితిని బట్టి చూస్తే తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల తుది జాబితా రేపు విడుదలయ్యే అవకాశముందని సమాచారం.

ఇక తెలంగాణలో జనసేనతో బీజేపీ పొత్తు ఖరారు అయింది. ఇక్కడ జనసేనకు ఎన్ని సీట్లు కేటాయించాలనే అంశం పై చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు. రాజకీయ వర్గాల ఊహాలను బట్టి జనసేనకు 8 లేదా 9 సీట్లు ఇవ్వాలనే ఆలోచనలో బీజేపీ ఉందని ప్రచారం జరుగుతుంది. మరోవైపు బీజేపీ తెలంగాణలో ఇంత స్లోగా ఉండటాన్ని కార్యకర్తలు జీర్ణించుకోలేక పోతున్నారు. రాష్ట్రంలో బీజేపీ గెలుస్తుందా అని కొందరు సందేహ పడుతున్నట్టు తెలుస్తుంది.

You may also like

Leave a Comment