Telugu News » BRS : దెబ్బ మీద దెబ్బ.. పీకల్లోతూ కష్టాల్లో కూరుకుపోయిన కేసీఆర్.. ఆయనపైనే భారం!

BRS : దెబ్బ మీద దెబ్బ.. పీకల్లోతూ కష్టాల్లో కూరుకుపోయిన కేసీఆర్.. ఆయనపైనే భారం!

తెలంగాణలో పదేళ్లు ఒక వెలుగు వెలిగిన బీఆర్ఎస్ (BRS) పార్టీకి వరుసగా షాకులు తగులుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు గులాబీ పార్టీలోకి ఇతర పార్టీల నేతలు క్యూ కట్టేవారు. పదవులు దక్కినా దక్కకపోయినా కేసీఆర్ దీవెనలు ఉంటే చాలని కొందరి నేతలు భావించేవారు. ఉద్యమ నాయకుడిగా, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి రెండు సార్లు ముఖ్యమంత్రిగా తన కంటూ ఓ చరిత్ర లిఖించుకున్న కేసీఆర్(KCR)

by Sai
KCR's politics around Annadata.. Will this strategy work?

తెలంగాణలో పదేళ్లు ఒక వెలుగు వెలిగిన బీఆర్ఎస్ (BRS) పార్టీకి వరుసగా షాకులు తగులుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు గులాబీ పార్టీలోకి ఇతర పార్టీల నేతలు క్యూ కట్టేవారు. పదవులు దక్కినా దక్కకపోయినా కేసీఆర్ దీవెనలు ఉంటే చాలని కొందరి నేతలు భావించేవారు. ఉద్యమ నాయకుడిగా, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి రెండు సార్లు ముఖ్యమంత్రిగా తన కంటూ ఓ చరిత్ర లిఖించుకున్న కేసీఆర్(KCR)..ప్రస్తుతం పీకల్లోతూ కష్టాల్లో కూరుకుపోయారు. ఒకేసారి ఆయన్ను కష్టాలు చుట్టుముట్టాయి. అధికారంలో ఉన్నపుడు కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు, నియంత పాలన, ఫ్యామిలీ మెంబర్స్ చేసిన తప్పులే ఆయన్ను ఇప్పుడు ఈ పరిస్థితికి తీసుకొచ్చాయని రాజకీయ విశ్లేషకులు, ఇతర పార్టీల నేతలు విమర్శిస్తున్నారు.

Blow after blow.. BRS which is in trouble all the time.. The burden is on KCR

కేసీఆర్ రెండోసారి సీఎం అయ్యాక ఆయన తీరులో చాలా మార్పు వచ్చిందని ఆ పార్టీలోని నేతలే అంటుంటారు. ఎవరినీ సరిగా కలిసే వారు కాదు.కేడర్, అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలకు సైతం అపాయింట్ మెంట్ ఇచ్చేవారు కాదు. ఎవరికీ ఏ సమస్య ఉన్నా కవిత, కేటీఆర్, సంతోష్, హరీశ్ రావులే చూసుకోవాలి.ఈ నియంత పాలనను ఆ పార్టీ నేతలు సహించలేకపోయారు.ప్రతిపక్షాలను చాలా చీప్‌గా చూసేవారు. వారి పట్ల నియంతలా వ్యహరించారు. ఉద్యమకారులను కూడా పట్టించుకోలేదని అపవాదును మూటగట్టకున్నారు. కాంగ్రెస్ పార్టీ సీఎల్పీని తమ పార్టీలో విలీనం చేసుకుని ప్రధాన ప్రతిపక్షం లేకుండా ఏకఛత్రాధిపతిగా పాలన సాగించారు.

దాని ఫలితంగానే 2023 ఎన్నికల్లో కేసీఆర్‌ను తెలంగాణ ప్రజలు గద్దె దించారు. ఆ తర్వాత ఆయన్ను వరుసగా కష్టాలు వెంటాడాయి. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారానికి ముందే ఇంట్లో కాలు జారి పడటంతో కాలు విరిగింది. దానికి తోడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులపై కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగడం, ఫోన్ ట్యాపింగ్ కేసు, ధరణి పోర్టల్‌లో అక్రమంగా భూ రిజిస్ట్రేషన్లు, బీఆర్ఎస్ నేతల భూ కబ్జాలపై ఉక్కుపాదం మోపింది.

ఈ క్రమంలోనే సీఎం రేవంత్ ఎక్కడ తమను జైళ్లో పెడుతాడో అనే భయంతో చాలా మంది నేతలు బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.మరికొందరు ఇప్పుడిప్పుడే ఆ పార్టీలోకి క్యూ కడుతున్నారు. మరోవైపు లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్టు చేసి ఢిల్లీకి తీసుకునిపోయింది. చెల్లిని ఎలాగైనా విడిపించాలని కేటీఆర్ హస్తినలోనే పావులు కదుపుతున్నారు.కేంద్రంలోని కీలక నేతలతో మంతనాలు జరపడంతో పాటు, ఫేమస్ లాయర్లను కలిసి న్యాయసలహాలు తీసుకుంటున్నట్లు తెలిసింది.

ఇక ఈడీ వ్యవహారంలో కేసీఆర్ ఇంతవరకు నోరు మెదపలేదు. ఒక్క కామెంట్ కూడా చేయలేదు. ఇంటి నుంచి బయటకు రావడం లేదు. మొన్నటివరకు హైదరాబాద్ లో ఉన్న కేసీఆర్.. కూతురి అరెస్టుతో ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌కు వెళ్లిపోయారు.అడపాదడపా మీటింగులు పెట్టి ఆయన ప్రసంగంలో ఏదో తెలియని భయం కనిపిస్తోందని పలువురు చర్చించుకుంటున్నారు. ఇక అసెంబ్లీ వ్యవహారాలు, ప్రభుత్వం చేసే విమర్శలకు హరీశ్ ఒక్కడే కౌంటర్ ఇస్తున్నారు. ఇప్పుడు గులాబీ పార్టీకి హరీశ్ పెద్ద దిక్కుగా మారాడని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కాంగ్రెస్ మంత్రులు కూడా హరీశ్‌ను తప్పా కేసీఆర్ ఫ్యామిలీపై దుమ్మెత్తిపోస్తున్నారు.

మరోవైపు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. అధికార కాంగ్రెస్, బీజేపీ ప్రచారంలో వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నాయి. అభ్యర్థులను కూడా ప్రకటించాయి. కానీ బీఆర్ఎస్ నేటికి అభ్యర్థులను ఫైనల్ చేయలేదు.ప్రచారంలో మూడో స్థానానికి పరిమితమైంది. కాంగ్రెస్, బీజేపీ గతంలో బీఆర్ఎస్ చేసిన తప్పులను టార్గెట్ చేసి ప్రచారంలో ముందుకు వెళ్తున్నాయి. ఓ వైపు కూతురి అరెస్టు, మరోవైపు కీలక నేతలు, మాజీ మంత్రులు పార్టీని వీడుతున్నారు.రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు చేజారిపోయాయి. లోక్‌సభ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ మూడో స్థానానికే పరిమితం అవుతుందని పలు సర్వేలు సైతం స్పష్టంచేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ పార్టీని, తన రాజకీయ భవిష్యత్‌‌ని, కేడర్‌ను, కూతురిని ఎలా కాపాడుకుంటారనేది పెద్ద చిక్కుప్రశ్నగా మారింది. పార్టీని గాఢిన పెట్టడం ఇప్పుడున్న పరిస్థితుల్లో కేవలం హరీశ్ వల్లే అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం భావిస్తున్నారు. కేసీఆర్ ఇకముందు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాలంటే మరికొంతకాలం వేచిచూడాల్సిందే.

 

You may also like

Leave a Comment