Telugu News » KTR : శూన్యం నుంచి సునామీ సృష్టించిన ధీరుడు కేసీఆర్.. కొత్త తరానికి నాంది పలుకుతాం : కేటీఆర్

KTR : శూన్యం నుంచి సునామీ సృష్టించిన ధీరుడు కేసీఆర్.. కొత్త తరానికి నాంది పలుకుతాం : కేటీఆర్

తెలంగాణ రాజకీయాలు(Telangana politics) ప్రస్తుతం రీవెంజ్ పాలిటిక్స్‌లా దర్శనమిస్తున్నాయి.గతంలో బీఆర్ఎస్ (BRS)పదేళ్లు అధికారంలో ఉంది. ఆ రోజుల్లో ప్రతిపక్షనేతలపై అడ్డగోలుగా కేసులు పెట్టి తమను ఇబ్బందులకు గురిచేశారని కాంగ్రెస్, బీజేపీ (BJP)పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు.

by Sai
KTR'

తెలంగాణ రాజకీయాలు(Telangana politics) ప్రస్తుతం రీవెంజ్ పాలిటిక్స్‌లా దర్శనమిస్తున్నాయి.గతంలో బీఆర్ఎస్ (BRS)పదేళ్లు అధికారంలో ఉంది. ఆ రోజుల్లో ప్రతిపక్షనేతలపై అడ్డగోలుగా కేసులు పెట్టి తమను ఇబ్బందులకు గురిచేశారని కాంగ్రెస్, బీజేపీ (BJP)పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ (CONGRESS)పార్టీ అధికారంలోకి వచ్చింది.బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉంది. ఆనాడు బీఆర్ఎస్ అనుసరించిన ఫార్ములానే ప్రజెంట్ కాంగ్రెస్ ఫాలో అవుతున్నదని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Brave KCR who created a tsunami from nothing.. We will usher in a new generation: KTR

రీవెంట్ పాలిటిక్స్ గురించి ఎందుకు మాట్లాడుకోవాలంటే.. గతంలో కాంగ్రెస్ పార్టీ సీఎల్పీని అప్పటి సీఎం కేసీఆర్ టీఆర్ఎస్‌లో విలీనం చేసుకున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షపార్టీ అనేది ఏది లేకుండా చేశారు. కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు. ప్రస్తుతం అదే విధానాలను సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ అవలంభిస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.

బీఆర్ఎస్ పార్టీ నేతలకు గాలం వేసి ఒక్కొక్కరిగా తమ పార్టీలోకి చేర్చుకుంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఇప్పటికే కీలక నేతలు, మాజీ మంత్రులు బీఆర్ఎస్‌ను వీడగా..తాజాగా బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ కే కేశవరావు, ఆయన కూతురు హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఆమె కూతురు కావ్యా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది.

అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీకి సిద్ధపడిన కావ్యా ఉన్నట్టుండి తాను పోటీ చేయడం లేదంటూ ప్రకటించింది. ఈ మేరకు గులాబీ బాస్‌‌కు లేఖ పంపింది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు.

‘శూన్యం నుంచి సునామీ సృష్టించి, అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ధీశాలి మన కేసీఆర్.. ఒక్కడుగా బయలుదేరి లక్షల మంది సైన్యాన్ని తయారుచేసి, ఎన్నో అవమానాలు,ద్రోహాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నిటిని ఛేదించిన ధీరత్వం కేసీఆర్.. అలాంటి ధీరుడిని కొన్ని కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలతో దెబ్బ తీయాలనుకునే రాజకీయ బేహారులకు తెలంగాణ ప్రజలే జవాబు చెప్తారు.

ప్రజా ఆశీర్వాదం, మద్దతుతో 14 ఏళ్లు పోరాడి, ఉద్యమ పార్టీగా తెలంగాణ సాధించి.. తెచ్చుకున్న తెలంగాణ దశను, దిశను మార్చి కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని ప్రజలు గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారు.నికార్సైన కొత్తతరం నాయకత్వం తయారుచేస్తాం,పోరాఠ పంథాలో కదం తొక్కుదాం.. జై తెలంగాణ, జై కేసీఆర్ అని రాసుకొచ్చారు.

 

You may also like

Leave a Comment