కాంగ్రెస్ (Congress) ప్రభుత్వంపై బీఆర్ఎస్ (BRS) విమర్శల పర్వం నిర్విరామంగా కొనసాగుతోంది. ఒకవైపు కేటీఆర్ (KTR) బల్లెంలా మారారని అనుకొంటుండగా.. మరోవైపు హరీష్ రావు మాటల తూటాలను సౌండ్ రాకుండా పేల్చుతున్నారని తెలుస్తోంది. ఇవాళ మెదక్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన.. రేవంత్ సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.. నాడు ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అబద్ధాలు, నేడు పాలనలో అసహనం స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు..
అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం రూ.14 వేల కోట్ల అప్పు చేసిందని హరీష్ రావు (Harish Rao) ఆరోపించారు.. హామీలన్నీ పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చేలోగానే అమలుచేయాలని డిమాండ్ చేశారు. లోక్‌సభ ఎన్నికలు అయిపోగానే హామీలపై చేతులెత్తేయాలని ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని ఆరోపణలు చేశారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడేది బీఆర్‌ఎస్ మాత్రమేనని స్పష్టంచేశారు.
మరోవైపు ఆరు గ్యారంటీల్లో భాగంగా రాష్ట్రంలోని 1.5 కోట్ల ఆడపడుచులు ఉన్నారని, వారందరికీ నెలకు రూ.2,500 ఇస్తానన్న సీఎం ఎక్కడా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనకు మార్చి17తో వంద రోజులు పూర్తి అవుతాయని గుర్తు చేశారు. లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ మొదటి వారంలో ఉంటాయన్న హరీష్ రావు.. ఆ లోపు ప్రభుత్వం రూ.2 లక్షల రైతు రుణమాఫీ, మహిళలకు రూ.2,500, రూ.4 వేల ఆసరా పెన్షన్ ఇస్తేనే కాంగ్రెస్ (Congress)కు ప్రజలు ఓట్లు వేస్తారని తెలిపారు.
మీరిచ్చిన హామీలు అమలు చేయకుంటే.. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టడం ఖాయమని పేర్కొన్నారు. హామీలపై ప్రశ్నిస్తే.. అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలో ఉన్నప్పుడు అదే పని చేస్తే.. సగం మంది కాంగ్రెస్ నాయకులు జైళ్లో ఉండేవారని హరీష్ రావు అన్నారు.. బీఆర్‌ఎస్ పూల