Telugu News » Gadkari : అర్బన్ ఎక్స్ టెన్షన్ రోడ్డుతో భారీగా తగ్గనున్న ప్రయాణ సమయం…!

Gadkari : అర్బన్ ఎక్స్ టెన్షన్ రోడ్డుతో భారీగా తగ్గనున్న ప్రయాణ సమయం…!

ఈ రహదారి అందుబాటులోకి వస్తే ఎయిర్ పోర్టుకు 20 నిమిషాల్లో చేరుకోవచ్చని తెలిపారు.

by Ramu

అర్బన్ ఎక్స్ టెన్షన్ రోడ్-2 మరో రెండు, మూడు నెలల్లో ప్రారంభం కానున్నట్టు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ (Nithin Gadkari) అన్నారు. సాధారణంగా మీరు ఢిల్లీ (Delhi) కి వచ్చి ఎయిర్ పోర్టు (Airport) కు వెళ్లేందుకు రెండు గంటల సమయం పడుతుందన్నారు. కానీ ఈ రహదారి అందుబాటులోకి వస్తే ఎయిర్ పోర్టుకు 20 నిమిషాల్లో చేరుకోవచ్చని తెలిపారు.

 

చెక్ రిపబ్లిక్‌లోని ప్రేగ్‌లో కేంద్ర మంత్రి పర్యటిస్తున్నారు. అక్కడ ప్రవాస భారతీయులు నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దేశంలో జరుగుతున్న మౌలిక వసతుల కల్పన గురించి ఆయన వివరించారు. రోహతంగ్ కనుమ నుంచి మనాలీకి చేరుకునేందుకు గతంలో మూడున్నర గంటలు పట్టేదన్నారు.

కానీ లఢఖ్ , లేహ్‌లో తాము జోజిలా సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పుడు ప్రజలకు రోహతంగ్ నుంచి మనాలీకి కేవలం 8 నిమిషాలు మాత్రమే పడుతోందన్నారు. ఈ రహదారి నిర్మాణానికి టెండర్లలో రూ. 12 వేల కోట్లు అంచనా వ్యయాన్ని నిర్ణయించామన్నారు. కానీ అందులో 70 శాతం పనులు పూర్తయ్యే వరకు రూ. 5,550 కోట్లు ఖర్చయిందన్నారు.

ఉత్తర ఢిల్లీని ఢిల్లీ-జైపూర్ జాతీయ రహదారితో కలుపుతున్న అర్బన్ ఎక్స్‌టెన్షన్ రోడ్-2 అనేది దేశ రాజధానిలో గేమ్ ఛేంజర్‌గా మారుతుందన్నారు. ఉత్తర భారత్ నుంచి దక్షిణ భారత్ కు ఢిల్లీ గుండా వెళ్లే వాహనాల వల్లే దేశ రాజధానిలో అత్యధిక ట్రాఫిక్ జామ్, అత్యం కాలుష్యం ఏర్పడుతోందన్నారు. ఈ రహదారి అందుబాటులోకి వస్తే ఢిల్లీలో ట్రాఫిక్ జామ్ భారీగా తగ్గుతుందన్నారు.

You may also like

Leave a Comment