Telugu News » ఈ ఫొటోలో ఉన్న స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టగలరా ? పొలిటీషన్ కూడా !

ఈ ఫొటోలో ఉన్న స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టగలరా ? పొలిటీషన్ కూడా !

by Sravya

పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ మామూలు క్రేజ్ కాదు పవన్ కళ్యాణ్ పేరు వింటే ఎంతో మంది అభిమానులు హృదయాలు ఉప్పొంగిపోతుంటాయి. పవన్ కళ్యాణ్ సినిమా వచ్చిందంటే చాలు ఇక ఫ్యాన్స్ కి పండుగనే రికార్డులు కూడా బద్దలై పోతాయి. లక్షలాదిమంది అభిమానులను సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ ఈ తరం యంగ్ జనరేషన్ వాళ్ళని కూడా ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. ఎంతోమంది యంగ్ ఫ్యాన్స్ కూడా పవన్ కళ్యాణ్ కి అండగా నిలుస్తున్నారు.

ఈమధ్య సినిమాలు కంటే కూడా రాజకీయాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు పవన్ కళ్యాణ్. ఓ వైపు మూవీస్, ఇంకో వైపు రాజకీయాలు. ఇది ఇలా ఉంటే పవన్ చిన్ననాటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ తన సోషల్ మీడియాలో ఎప్పుడూ వ్యక్తిగత విషయాలు ఎక్కువగా ప్రస్తావించరు చాలా అరుదుగా ఇలాంటివి కనపడుతూ ఉంటాయి. పవన్ సోదరులు అయిన చిరంజీవి నాగబాబు ఇద్దరు సోదరీమణులతో పవన్ కళ్యాణ్ తీసుకున్న ఫోటో ఇది.

Also read:

ఇది చాలా అరుదైన ఫోటో అని చెప్పొచ్చు దాదాపు 40 ఏళ్ల క్రిందటి ఫోటో ఇది. అందరినీ ప్రస్తుతం ఆకట్టుకుంటోంది. పవన్ కళ్యాణ్ అప్పుడు ఏడవ తరగతి చదువుతున్నారు. నెల్లూరులోని చదువుకుంటున్నప్పుడు తీసిన ఫోటో ఇది అని తెలుస్తోంది. చిరంజీవి అప్పటికి హీరోగా రాణిస్తున్నారు. పవన్ కళ్యాణ్ మాత్రం ఒక నిక్కరు చొక్కాతో కనపడ్డారు. ఆ సమయంలో పవన్ దీర్ఘకాలిక శ్వాస కోసం వ్యాధి నుండి కోల్కున్నారట. పవన్ కళ్యాణ్ అభిమానుల్ని ఈ ఫోటో బాగా ఆకట్టుకుంటుంది.

 

You may also like

Leave a Comment