భారత్(Bharath)లో 2022 సంవత్సరంలో 14.1 లక్షల క్యాన్సర్ కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ఓ నివేదికలో వెల్లడించింది. ఆ ఏడాది సుమారు 9.1 లక్షల మంది క్యాన్సర్ వ్యాధి(Cancer Cases) వల్ల మృతిచెందారని తెలిపింది. అయితే, భారతీయుల్లో ఎక్కువ శాతం రొమ్ము క్యాన్సర్ ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.
ఎక్కువ శాతం పురుషుల్లో పెదవి, నోరు, ఊపిరితిత్తులు క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని తెలిపింది. నోటి క్యానర్స్ 15.6 శాతం, శ్వాసకోస క్యాన్సర్ 8.5 శాతం కేసులు నమోదయ్యాయి. ఇక, మహిళల్లో రొమ్ము, సర్వెకల్ క్యాన్సర్ కేసులు నమోదు అవుతున్నాయని తెలిపింది. అయితే, రొమ్ము క్యాన్సర్ 27 శాతం, 18 శాతం సర్వెకల్ క్యాన్సర్ కేసులు ఉన్నట్లు ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసర్చ్ ఆన్ క్యాన్సర్ సంస్థ తెలిపింది.
ఈ సంస్థ డబ్ల్యూహెచ్ క్యాన్సర్ ఏజెన్సీగా వర్క్ చేస్తుంది. క్యాన్సర్ ఉన్నట్లు గుర్తించిన ఐదేళ్ల తర్వాత భారత్‌లో ప్రాణాలతో ఉన్నవారి సంఖ్య 32.6 శాతంగా ఉందని ఆ నివేదికలో తేల్చింది. ప్రతీ ఐదుగురిలో ఒకరికి క్యాన్సర్ వస్తోందని తెలిపింది. తొమ్మిది మంది పురుషుల్లో ఒకరు, 12 మంది మహిళల్లో ఒక మహిళకు క్యాన్సర్ వ్యాధి వ్యాప్తి చెందుతోందని తెలిపింది.
అదేవిధంగా 115 దేశాలకు చెందిన క్యాన్సర్ రిపోర్టును డబ్ల్యూహెచ్‌వో విడుదల చేసింది. కేవలం 39 శాతం దేశాలు మాత్రమే క్యాన్సర్ చికిత్స గురించి అవగాహన కల్పిస్తున్నట్లు ఆ నివేదికల్లో పేర్కొన్నారు. మరోవైపు, దేశవ్యాప్తంగా సర్వెకల్ క్యాన్సర్ బాధితులు 3,42,333 మంది బాధపడుతున్నట్లు కేంద్రం వెల్లడించింది. అందులో ఏపీ 17,146 మంది బాధితులతో ఏడో స్థానంలో ఉండగా తెలంగాణ 11,525మంది బాధితులతో 11వ స్థానంలో ఉన్నాయి.