Telugu News » Chandrababu : ఐటీ ఉద్యోగుల ర్యాలీతో సరిహద్దుల్లో టెన్షన్ !

Chandrababu : ఐటీ ఉద్యోగుల ర్యాలీతో సరిహద్దుల్లో టెన్షన్ !

స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్టుపై ఐటీ ఉద్యోగులు ఫైర్ అవుతున్నారు. దీనిలో భాగంగా చంద్రబాబు నాయుడుకి మద్దతుగా ర్యాలీలు, ఆందోళనలు నిర్వహిస్తున్నారు.

by Prasanna
car rally

చంద్రబాబు (Chandrababu) కి మద్దతుగా ఐటీ ఉద్యోగులు (IT Employees)  హైదరాబాద్ టు రాజమండ్రికి తలపెట్టిన ర్యాలీతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ బోర్డర్‌ (State Border) లో టెన్షన్ నెలకొంది. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వరకూ భారీ కార్ ర్యాలీకి హైదరాబాద్ ఐటీ ఉద్యోగులు పిలుపునిచ్చారు.

car rally

స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్టుపై ఐటీ ఉద్యోగులు ఫైర్ అవుతున్నారు. దీనిలో భాగంగా చంద్రబాబు నాయుడుకి మద్దతుగా ర్యాలీలు, ఆందోళనలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఇవాళ చంద్రబాబు నాయుడు అరెస్టుకు వ్యతిరేకంగా ఐటీ ఉద్యోగులు ఛలో రాజమండ్రికి పిలుపునిచ్చారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి భారీ కార్ ర్యాలీకి నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అయితే, ఐటీ ఉద్యోగులు తలపెట్టిన ర్యాలీతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ బోర్డర్‌లో టెన్షన్ నెలకొంది.

ఐటీ ఉద్యోగుల ఛలో రాజమండ్రి ర్యాలీ నేపథ్యంలో ఏపీ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఐటీ ఉద్యోగులు తలపెట్టిన ర్యాలీకి అనుమతి లేదంటూ స్పష్టంచేశారు. ఈ మేరకు పోలీసులు ఆంక్షలు విధించారు. ర్యాలీలకు, యాత్రలకు అనుమతి లేదని.. ఎట్టి పరిస్థితిలోనూ ర్యాలీని ఆంధ్రప్రదేశ్‌లోకి అనుమతించమని పోలీస్ శాఖ స్పష్టం చేసింది. నిబంధలను ఉల్లంగిస్తే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించింది. ర్యాలీ నేపథ్యంలో ఏపీ, తెలంగాణ సరిహద్దులో భారీగా పోలీసులను మోహరించారు.

ఏపీ సరిహద్దులోని గరికపాడు వద్ద నుంచి అనుమంచిపల్లి వరకు 3 పోలీస్‌ అవుట్‌ పోస్టులను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంటి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించి.. అన్ని వివరాలు సేకరించిన తర్వాత.. వాళ్లు ర్యాలీకి కాదని నిర్ధారించుకున్నాకే అనుమతిస్తున్నారు. ఇందుకోసం.. భారీగా పోలీసు సిబ్బందిని సరిహద్దు వద్ద మోహరించారు.

మరోవైపు.. హైదరాబాద్‌కు కూడా ఏపీ టాస్క్‌ఫోర్స్ పోలీసులు భారీగా చేరుకున్నారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు మద్దతుదారులపై పోలీసులు దృష్టి పెట్టారు.  ఐటీ ఉద్యోగుల సోషల్ మీడియా, వాట్సప్ గ్రూపులపై కూడా ఆరా తీస్తున్నారు. ORR ర్యాలీలో పాల్గొన్న ఐటీ ఉద్యోగులకు ఇప్పటికే ఏపీ పోలీసుల నుంచి ఫోన్లు వెళ్లాయని తెలుస్తోంది.

You may also like

Leave a Comment