చంద్రబాబు నాయుడు గురించి తెలియని వారు ఉండరు. ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ కి సేవలు అందించారు చంద్రబాబు. తాజాగా చంద్రబాబు నాయుడు కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసి అంతా విపరీతంగా షేర్ చేస్తున్నారు. సోషల్ మీడియా కారణంగా మనకి తెలియని ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి. పైగా ఎప్పటివో పాత విషయాలు కూడా సోషల్ మీడియా పుణ్యమా అంటూ బయటికి వస్తూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ పదవ తేదీన పెళ్లి చేసుకోవడం జరిగింది.
అయన పెళ్లి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ వివాహ పత్రిక చంద్రబాబు స్వయంగా ఆహ్వానిస్తున్నట్లు డిజైన్ చేశారు. ఎన్టీఆర్ కూతురు భువనేశ్వరిని ఆయన పెళ్లి చేసుకున్నారు. ఆమెని పెళ్లి చేసుకుంటున్నానని అందరూ రావాలని ఆయనే స్వయంగా ఆహ్వానిస్తున్నట్లు ఈ కార్డులో ఉంది. ఈ పెళ్లి వేడుక జరిగేటప్పటికి ఎన్టీఆర్ టాప్ హీరోలలో ఒకరిగా ఉన్నారు ఇంకోవైపు చంద్రబాబు నాయుడు కూడా సినిమాటోగ్రఫీ మినిస్టర్ పదవిలో ఉన్నారు. దీంతో ఈ పెళ్లికి అప్పట్లో మామూలు క్రేజ్ లేదు. అన్ని మీడియాలలోనూ ఈ పెళ్లి గురించి రాశారు.
Also read:
ఒకవైపు రాజకీయ ప్రముఖులు, ఇంకో పక్క సినిమా తారలు కూడా ఈ పెళ్ళికి వచ్చారు అలానే చంద్రబాబు నాయుడు చాలా కట్నం తీసుకున్నారని వార్తలు కూడా వచ్చాయి. కానీ నిజానికి చంద్రబాబు నాయుడు ఒక్క రూపాయి కూడా కట్నం తీసుకోకుండా భవనేశ్వరిని పెళ్లి చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు అసలు కట్నం అడగలేదు. అలానే ఎన్టీఆర్ కూడా కట్నం ఇవ్వడానికి ముందుకు రాలేదు. వీళ్ళ వివాహ వేడుకని అప్పట్లోనే అంగరంగ వైభవంగా జరిపించారు. అప్పటి పెళ్లి ఫోటో పెళ్లి కార్డు సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ షికారులు కొడుతున్నాయి. విపరీతంగా వీటిని షేర్ చేస్తున్నారు మరి చంద్రబాబు నాయుడు పెళ్లి పత్రికని, పెళ్లి ఫోటోని మీరు కూడా చూసేయండి.