Telugu News » Chandra Mohan: నేడు పంజాగుట్ట శ్మశాన వాటికలో చంద్రమోహన్ అంత్యక్రియలు..!

Chandra Mohan: నేడు పంజాగుట్ట శ్మశాన వాటికలో చంద్రమోహన్ అంత్యక్రియలు..!

నేడు చంద్రమోహన్ అంత్యక్రియలు పంజాగుట్ట(Panjagutta) శ్మశాన వాటిలో నిర్వహించబోతున్నారు. ఆయనకు కడసారి వీడ్కోలు పలికేందుకు పెద్ద ఎత్తున అభిమానులు సినీ ప్రముఖులు వెళ్తున్నారు.

by Mano
chandra mohan

సీనియర్ నటుడు చంద్రమోహన్(Chandramohan) శనివారం కన్నుమూశారు. ఆయన కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా హైదరాబాద్ అపోలో ఆస్పత్రి(Appollo Hospital)లో చేరి చికిత్స పొందుతూ శనివారం ఉదయం 9.45 నిమిషాలకు ప్రాణాలు కోల్పోయారు. నేడు చంద్రమోహన్ అంత్యక్రియలు పంజాగుట్ట(Panjagutta) శ్మశాన వాటిలో నిర్వహించబోతున్నారు.

chandra mohan

ఆయనకు కడసారి వీడ్కోలు పలికేందుకు పెద్ద ఎత్తున అభిమానులు సినీ ప్రముఖులు వెళ్తున్నారు. చంద్రమోహన్ శనివారం మృతిచెందగా ఆయనకు సోమవారం అంటే మూడ్రోజుల తర్వాత అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఇలా రెండు రోజుల పాటు ఆయన అంత్యక్రియలు ఆలస్యంగా ఎందుకు నిర్వహిస్తున్నారని చాలా మందికి డౌట్ వస్తోంది. అయితే ఇలా ఆలస్యంగా చేయడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి.

చంద్రమోహన్ భార్య జలంధర, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె పేరు మధుర మీనాక్షి. ఆమె సైకాలజిస్టుగా పని చేస్తున్నారు. అలాగే చిన్న కుమార్తె మాధవి చెన్నెలో సెటిల్ అయ్యారు. పెద్ద కూతురు మధుర మీనాక్షి మాత్రం అమెరికాలో ఉంటున్నారు. అయితే ఆవిడ తండ్రి అంత్యక్రియల కోసం రావడానికి కాస్త సమయం పట్టింది. కాబట్టి రెండు రోజులు ఆలస్యంగా ఈయన అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు.

దీపావళి పండుగకు ఒక్క రోజు ముందే చంద్రమోహన్ చనిపోవడం నిజంగా బాధాకరమే. పండుగ వదిలిపెట్టుకొని అంత్యక్రియలకు వెళ్లేందుకు ఎవరూ ఎక్కువగా ఇష్టపడరు. దీని వల్ల చాలా మంది అభిమానులు కూడా ఆయనను కడసారి చూసేందుకు రాలేరని భావించి అంత్యక్రియలు సోమవారం నిర్వహించాలనుకున్నట్లు సమాచారం. ఈ రెండు కారణాలతో చంద్రమోహన్ అంత్యక్రియలను నేడు నిర్వహిస్తున్నారు.

You may also like

Leave a Comment