చేవెళ్ల (Chevella) కాంగ్రెస్ (Congress) ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి (Ranjith Reddy)పై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు.. రాష్ట్రంలో దొంగే దొంగా అన్నట్లుగా, దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా అవినీతి పరులైన వాళ్ళే నేడు సత్య హరిచంద్రులుగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.. నీడనిచ్చిన చెట్టునే నరుక్కొన్నట్లుగా బీఆర్ఎస్ పట్ల రంజిత్ వ్యవహరించిన తీరు ఉందని మండిపడ్డారు..
అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి, రంజిత్ రెడ్డి మధ్య ఒప్పందం ఏంటో బయటపెట్టాలని డిమాండ్ చేశారు.. గతంలో కోడిగుడ్లు అమ్ముకొనే ఆయన చేవెళ్ల నియోజకవర్గంలో 3 వేల ఎకరాలు ఎలా సంపాదించాడని ప్రశ్నించారు.. బీఆర్ఎస్ నుంచి బయటికి పోయిన సోకాల్డ్ నాయకులు ఏవేవో విమర్శలు చేస్తున్నారు.. ఒక్క సారి ఆలోచించుకోండి.. పార్టీలోకి రాకముందు మీరు ఎలా ఉండేవారు అని మాజీ ఎమ్మెల్యే సూచించారు..
మరోవైపు రంజిత్ రెడ్డి పెద్ద ఆవినీతిపరుడని ఆరోపించిన జీవన్ రెడ్డి (Jeevan Reddy).. సిద్దిపేటలో సర్వే నంబర్ 591లో 9 ఎకరాలు 27 గంటల అసైన్ మెంట్ ల్యాండ్ పై చట్ట విరుద్ధంగా బ్యాంక్ లోన్ తీసుకొన్నారని.. అలాగే గతంలో బండ్ల గణేశ్ ల్యాండ్ కూడా గుంజుకున్నారని ఆరోపణలు చేశారు.. మోసాలు చేయడానికి అలవాటు పడిన రంజిత్ రెడ్డి, చేవెళ్ల ప్రజలకు ఏం మేలు చేస్తాడో అర్థంకావడం లేదన్నారు..
పుప్పాలగూడ సర్వే నంబర్ 341 లో ఒక కోటి నలభై నాలుగు లక్షల స్కైర్ ఫీట్ లో అక్రమ కట్టడాలకు తెరలేపిన రంజిత్.. వాటికి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు కాంగ్రెస్ పార్టీలో జయిన్ అయ్యాడని విమర్శించారు.. ఆయనతో కలసి, సునీతా మహేందర్ రెడ్డి కూడా భూ కబ్జాలు చెయ్యడంలో దిట్టా అని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు..
కరీంనగర్ లో పుట్టిన రంజిత్, చేవెళ్ల వ్యక్తి కాదని తెలిపిన జీవన్ రెడ్డి.. వలస వచ్చి ఇక్కడ బిజినెస్ పెట్టుకున్నారన్నారు.. కాబట్టి చేవెళ్ల ప్రజలు ఆయనకు తగిన బుద్ధి చెప్పాలని సూచించారు.. లాగే ఫాదర్ ఆఫ్ చీటర్ అయిన రంజిత్ రెడ్డి గురించి రోజుకోక ఎపిసోడ్ తో మీడియా ముందుకు వస్తా.. ఆయన అవినీతి బయట పెడుతానని హెచ్చరించారు..