లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బీఆర్ఎస్ (BRS), బీజేపీ (BJP)పై విమర్శలతో విరుచుకు పడుతున్నారు.. పలు ఆరోపణలు గుప్పిస్తూ.. ఓట్లను రాబట్టుకొనే ప్రయత్నంలో ఉన్నారు.. ఈ క్రమంలో నేడు చేవెళ్ల (Chevella) ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి తరపున ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు రాత్రింబవళ్లు కష్టపడి కేసీఆర్ అహంకారాన్ని ఖతం చేశారని తెలిపారు.

మరోవైపు బీజేపీ పై కూడా విమర్శలు గుప్పించిన రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు.. పదేళ్ల నుంచి ప్రధాని మోడీ దేశ ప్రజలను మోసం చేస్తూ వస్తున్నాడని ఆరోపించారు. రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తీసుకొచ్చారని గుర్తుచేసిన ఆయన.. నల్ల ధనాన్ని వెనక్కి తీసుకొస్తానని చెప్పి నిండా ముంచారని విమర్శించారు.. కనీసం ఒక్కరి ఖాతాలో కూడా రూ.15 లక్షలు వేయలేదని మండిపడ్దారు.
నమో అంటే నమ్మించి మోసం చేయడం అని ఎద్దేవా చేసిన సీఎం.. తెలంగాణకు పదేళ్లలో మోడీ ఒక్క విద్యా సంస్థను కూడా ఇవ్వలేదన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ రిజర్వేషన్లకు వ్యతిరేకం అని తెలిపారు. కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందని పేర్కొన్నారు. మరోవైపు కాంగ్రెస్ (Congress) ప్రభుత్వ హయాంలో కులగణనతో బీసీలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.