Telugu News » CID: స్కిల్ కేసులో చంద్రబాబు ఏ1.. సీఐడీ చార్జిషీటు దాఖలు..!

CID: స్కిల్ కేసులో చంద్రబాబు ఏ1.. సీఐడీ చార్జిషీటు దాఖలు..!

ఈ కేసు విచారణ విజయవాడ ఏసీబీ కోర్టులో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏ1గా చంద్రబాబు, ఏ2గా అచ్చెన్నాయుడు, ఏ3గా గంటా సుబ్బారావు, ఏ4గా మాజీ ఐఏఎస్ అధికారి కె. లక్ష్మీనారాయణల పేర్లను సీఐడీ తన చార్జిషీట్‌లో పేర్కొంది.

by Mano
CID: Chandrababu A1 in skill case.. CID charge sheet filed..!

టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న స్కిల్ డెవలప్ మెంట్ కేసు(Skill Development Case)లో సీఐడీ(CID) నేడు చార్జిషీటు దాఖలు చేసింది. ఈ కేసు విచారణ విజయవాడ ఏసీబీ కోర్టులో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏ1గా చంద్రబాబు, ఏ2గా అచ్చెన్నాయుడు, ఏ3గా గంటా సుబ్బారావు, ఏ4గా మాజీ ఐఏఎస్ అధికారి కె. లక్ష్మీనారాయణల పేర్లను సీఐడీ తన చార్జిషీట్‌లో పేర్కొంది.

CID: Chandrababu A1 in skill case.. CID charge sheet filed..!

చంద్రబాబును నిందితుడిగా పేర్కొంటూ ఇప్పటికే ఫైబర్ నెట్, అసైన్డ్ భూముల కేసుల్లోనూ సీఐడీ చార్జిషీట్ సమర్పించింది. నాడు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో స్కిల్ డెవలప్ మెంట్ పేరిట షెల్ కంపెనీల ద్వారా రూ.241 కోట్ల కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. 2014లో చంద్రబాబునాయుడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన నెలరోజుల్లో యువత ఉపాధి, వ్యవస్థాపకతను ప్రోత్సహించేదుకు స్కిల్ డెవలప్ మెంట్ కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ మేరకు సెంటర్లను ఏర్పాటు చేసేందుకు టీడీపీ సిమెన్స్ ఇండియాతో ఎంఓయూ ఒప్పందాన్ని చేసుకుంది. ఇందులో 10 శాతం ఖర్చును ప్రభుత్వం పెట్టుకుంటే. 90 శాతం ఖర్చు సీమెన్స్ గ్రాంట్‌గా ఇవ్వాలని ఒప్పంద సారాశం. 2015లో ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ స్థాపించారు. రూ.3,356 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ మోహన్ రెడ్డి 2021లో జరిగిన ఏపీ అసెంబ్లీలో పెద్ద స్కామ్‌గా అభివర్ణించారు.

2021 డిసెంబర్ లోనే చంద్రబాబుపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ప్రాజెక్టుకు కేటాయించిన నిధుల్లో రూ.241 కోట్లను షెల్ కంపెనీలకు పంపారన్న ఆరోపణలున్నాయి. 2023 సెప్టెంబర్ 9న చంద్రబాబు నాయుడిని సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు సీఐడీ అధికారులు చంద్రబాబుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేసి అరెస్ట్ చేశారు. దాదాపు రెండు నెలల పాటు రాజమండ్రి జైల్లో గడిపిన చంద్రబాబు గతేడాది అక్టోబరు 31న విడుదలైన సంగతి తెలిసిందే.

You may also like

Leave a Comment