పార్లమెంట్ ఎన్నికలు అతి సమీపంలోకి వస్తున్న కొద్ది.. నేతలు మాటల్లో ఘాటు కూడా పెంచుతున్నారు.. ఈ క్రమంలో తాజాగా ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై డీకే అరుణ (DK Aruna) ధ్వజమెత్తారు.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఖబడ్దార్ అంటూ మండిపడ్డారు.. నేడు మీడియాతో మాట్లాడిన ఆమె.. ఎన్నికల కోడ్ వచ్చాక సీఎం ఐదు సార్లు పాలమూరుకు రావడం చూస్తే తనపై కుట్ర చేస్తున్నారనిపిస్తుందని ఆరోపించారు..
ఈ ప్రాంతం కోసం ఒక పాలమూరు (Palamuru) బిడ్డ కృషి చేస్తే ఓర్వలేక ఓడించేందుకు రాక్షసులుగా, రాబందులగా మారి నోటికి వచ్చినట్లు వాగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంస్కారం లేని సీఎం ఓ మహిళ అని కూడా చూడకుండా తన స్థాయిని మర్చిపోయి దొరసాని, తొక్కుతా అని నోటికి పనిచెప్పడం సిగ్గుచేటని డీకే అరుణ ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి (Revanth Reddy), మహబూబ్ నగర్ (Mahbubnagar) అభివృద్ధి కోసం ఏనాడైనా పోరాటం చేశారా? అని ప్రశ్నించారు.
నన్ను తొక్కుతా అంటావా? దమ్ముంటే ఎక్కడికోస్తావో రా? నోటికొచ్చినట్లు మాట్లాడుతావా బిడ్డా ? నీకు తల్లి, చెల్లి లేదా? నీకు బిడ్డా లేదా? ఒక మహిళా నేత గురించి ఎలా మాట్లాడాలి అన్న ఇంగిత జ్ఞానం కూడా లేదా? అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.. పేదల కోసం పోరాటం చేసిన చరిత్ర మాకు ఉన్నదని తెలిపిన అరుణ నీ చరిత్ర గురించి ముందు తెలుసుకొని మాట్లాడు అంటూ వార్నింగ్ ఇచ్చారు..
ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న నీ స్థాయి ఏంటి? అని ప్రశ్నించిన డీకే అరుణ.. నా బాగోతం ఎందో మీ బాగోతం ఏందో పాలమూరు చౌరస్తాలో తేల్చుకుందాం రా అంటూ సవాల్ విసిరారు.. ఒక మహిళను ఓడించేందుకు గుంపులు కట్టి నోటికొచ్చినట్లు మాట్లాడితే పాలమూరు ప్రజలు క్షమించరన్నారు.. ఈ ప్రాంత ఎమ్మెల్యేగా, ఎంపీగా ఉండి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు..