Telugu News » Cm kcr: తొందర పడొద్దు.. మన గెలుపు తథ్యం: సీఎం కేసీఆర్

Cm kcr: తొందర పడొద్దు.. మన గెలుపు తథ్యం: సీఎం కేసీఆర్

51 బీ-ఫారాలు రెడీ.. మిగ‌తావి రేపు ఇస్తాం

by Mano
Cm kcr: Don't be in a hurry.. The fact of our victory: CM KCR

Cm kcr: తెలంగాణలో జరగబోయే ఎన్నికల్లో మరోసారి విజయం బీఆర్ఎస్‌దేనని, అభ్యర్థులెవరూ తొందరపడొద్దని సీఎం కేసీఆర్ వెల్లడించారు. తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. ‘వేములవాడలో వాస్తవానికి మార్చాల్సిన అవసరం లేదున్యాయపరమైన అంశాల వల్ల వేములవాడలో మార్చాం. ఎన్నికల వేళ కొన్ని కోపతాపాలు ఉంటాయి.  సహజమే. అయినా అభ్యర్థులకు ఓపిక, సంయమనం అవసరం. నామినేషన్ల విషయంలో అజాగ్రత్త వద్దు. మాకే అంతా తెలుసని అనుకోవద్దు’  అని తెలిపారు.

Cm kcr: Don't be in a hurry.. The fact of our victory: CM KCR

ఇవాళ్టి వ‌ర‌కు 51 బీ-ఫారాలు మాత్ర‌మే రెడీ అయ్యాయ‌ని, మిగ‌తావి రేపు అందిస్తామ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. ఇక బీ-ఫారాలు నింపేట‌ప్పుడు జాగ్ర‌త్త‌లు తీసుకోవాలని పొర‌పాటు చేయొద్ద‌ని కేసీఆర్ సూచించారు.  ఇప్ప‌ట్నుంచే నామినేష‌న్ల విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకోవాలని చివ‌రి రోజున నామినేష‌న్లు వేసేందుకు ప్ర‌య‌త్నించొద్దని తెలిపారు. తెలంగాణ భ‌వ‌న్‌లో బీఆర్ఎస్ అభ్య‌ర్థుల‌కు బీ-ఫారాలు అంద‌జేసిన సంద‌ర్భంగా కేసీఆర్ ప్ర‌సంగించారు.

ఇక బీ-ఫారాలు నింపేట‌ప్పుడు జాగ్ర‌త్త‌లు తీసుకోవాలన్నారు. ఎట్టిపరిస్థితిలో పొర‌పాటు చేయొద్ద‌ని కేసీఆర్ సూచించారు. తెలంగాణ భ‌వ‌న్‌లో బీఆర్ఎస్ అభ్య‌ర్థుల‌కు బీ-ఫారాలు అంద‌జేసిన సంద‌ర్భంగా కేసీఆర్ ప్ర‌సంగించారు. శ్రీనివాస్ గౌడ్, వ‌న‌మా వెంక‌టేశ్వ‌ర్ రావు, కృష్ణ‌ మోహ‌న్‌రెడ్డి మీద కేసులు పెట్టారని కేసీఆర్ గుర్తు చేశారు. గెల‌వ‌లేక కోర్టుల్లో కేసులు వేసి ఇబ్బంది పెట్టారని సాంకేతికంగా కార‌ణాలు చూపి, ఇబ్బంది పెట్టే ప్ర‌య‌త్నం చేశారు. గైడ్ చేయ‌డానికి అభ్యర్థులకు న్యాయ‌వాదులు అందుబాటులో ఉంటారని చెప్పారు. వారితో మాట్లాడి, తెలియ‌ని విష‌యాలు తెలుసుకోవాలన్నారు.

ఎన్నిక‌లు వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా త‌మాషాలు జరుగుతుంటాయని, ఈ ఎన్నిక‌ల్లో నిబంధ‌న‌లు మారుస్తుంటారని సూచించారు. ప్రతీది తెలుసుకునే ప్రయత్నం చేయాలన్నారు. అన్నీ మాకు తెలుసనే భావనలో ఉండవద్దని హితవు పలికారు. 98480 23175 నంబ‌ర్‌కు ఫోన్ చేస్తే భ‌ర‌త్ కుమార్ 24 గంట‌లు అందుబాటులో ఉంటారని కేసీఆర్ సూచించారు.  మ‌న పార్టీకి, ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు మ‌ధ్య వార‌ధిగా భ‌ర‌త్ కుమార్ ప‌ని చేస్తున్నారు. ఇవాళ 51 బీ-ఫారాలు త‌యారు చేశాం. బీ-ఫారాలు నింపేట‌ప్పుడు అప్డేట్ ఓట‌ర్ జాబితాను అనుసిరించాలని, మిగ‌తా బీ-ఫారాలు రేపు అందిస్తామ‌ని కేసీఆర్ స్పష్టం చేశారు.

 

You may also like

Leave a Comment