పార్లమెంట్ ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా ఒకే ట్రెండ్ నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో మమ్మల్ని గెలిపిస్తే ప్రజలకు ఏం చేస్తామనేది చెప్పకుండా అధికార, ప్రతిపక్షాలు కేవలం తిట్టుకోవడం, తప్పులు చూపించుకోవడమే సరిపోతోంది.కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇదే ట్రెండ్‌ను పొలిటికల్ పార్టీలు ఫాలో అవుతున్నాయి.
ఇకపోతే ఒడిశా(Odisa) రాష్ట్రంలో కాస్త విభిన్నంగా ‘లుంగి’(Lungi)పంచాయితీ తెరమీదకు వచ్చింది. మొన్నటివరకు ఆ రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీ అవినీతి, వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టారు. కానీ, ఇప్పుడు సీఎం నవీన్ పట్నాయక్ వేషాధారణ గురించి లొల్లి పెట్టుకుంటున్నారు.
ఒడిశాలో పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఆ రాష్ట్ర అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగనున్నాయి.ఈ నేపథ్యంలోనే బిజూ జనతాదల్ (బీజేడీ)(BJD) అధినేత, సీఎం నవీన్ పట్నాయక్ ఓటర్లను ఉద్దేశించి ఓ వీడియోను విడుదల చేశారు. వచ్చే ఎన్నికల్లో తన పార్టీ ‘శంఖం’గుర్తునకు ఓటేసి గెలిపించాలని ప్లకార్డు పట్టుకోని చూపించారు.
ఆ వీడియోలో సీఎం నవీన్ పట్నాయక్ లుంగిలో కనిపించారు. అయితే, దీనిపై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విమర్శలు చేయడంతో..ఆయనకు కౌంటర్‌గా బీజేడీ నేతలు సస్మిత్ పాత్ర, స్వయంప్రకాశ్ మహాపాత్ర లుంగీలు ధరించి ప్రెస్‌మీట్ నిర్వహించడంతో పాటు ఫోటోలకు ఫోజులించ్చారు.దీంతో ప్రస్తుతం బీజేపీ-బీజేడీ పార్టీల మధ్య లుంగీ వివాదం ముదురుతోంది.