పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ కర్ణాటక (Karnataka)లో భారీ బహిరంగ సభను నిర్వహించింది. ఇందులో పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) కన్నడ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూనే.. బీజేపీ (BJP) సర్కార్ పై నిప్పులు కురిపించారు. 40కోట్ల ఖాతాలు తెరిపించిన ప్రధాని, ఒక్క పైసా కూడా పేదల ఖాతాల్లో వేయలేదని విమర్శించారు.. కరవు వస్తే కనీసం బెంగళూరుకు నీళ్లు కూడా ఇవ్వలేదని ఆరోపించారు.
మరోవైపు ఖర్గే మీ మనిషి అని పేర్కొన్న రేవంత్.. ఆయన ఇక్కడి నుంచి తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపీగా కొనసాగారన్నారు.. 1972లో మొదటిసారిగా మీరు ఎన్నుకున్న మల్లికార్జున ఖర్గే.. ప్రస్తుతం ఏఐసీసీ అధ్యక్షుడుగా ఇప్పుడు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. గుర్మిట్కల్ (Gurmitkal) ప్రజల ఆశీర్వాదం వల్లే ఆయన ఈ స్థాయికి చేరుకొన్నట్లు వివరించారు..
మీరు ఇచ్చిన స్ఫూర్తితో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని తెలిపిన రేవంత్.. కర్ణాటకలో ఐదు గ్యారంటీలను ప్రభుత్వం కచ్చితంగా అమలు చేసిందని, తెలంగాణలోనూ ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారంటీలు ఇప్పటికే అమలవుతున్నాయని వెల్లడించారు. పదేళ్లలో మోదీ ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదని విమర్శించారు.. నల్లధనాన్ని తెచ్చి ప్రజల ఖాతాల్లో వేస్తామన్న ఆయన మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు.
మాట మీద నిలబడని ప్రధానిని ఓడించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చిన రేవంత్.. ప్రజలకు అండగా ఉండే హస్తాన్ని గెలిపించుకోవాలని సూచించారు. సమర్ధుడు, మీ కోసం కొట్లాడే వారికే ఓటువేయండని కోరారు.. ఇక్కడ కాంగ్రెస్ (Congress)కు ఒక్క ఓటు వేస్తే.. ముగ్గురు నాయకులు మీకు సేవ చేస్తారని తెలిపారు. లాగే రిజర్వేషన్లు కావాలనుకుంటే కాంగ్రెస్ కు ఓటు వేయండి.. ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్ ను గెలిపించండని ఓటర్లను కోరారు..