తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం త్వరలో 2050 మెగా మాస్టర్ ప్లాన్ (Master Plan) తీసుకు రాబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. అర్బన్, సెమీ అర్బన్, రూరల్ మూడు భాగాలుగా అభివృద్ధిని ముందుకు తీసుకెళతామని వెల్లడించారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో రీజినల్ రింగ్ రోడ్డును త్వరలోనే తీసుకువస్తామని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
నానక్ రామ్‌గూడలో తెలంగాణ స్టేట్ ఫైర్ సర్వీసెస్ హెడ్ క్వార్టర్స్ భవనాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…. హైదరాబాద్ నగరాన్ని మాజీ సీఎంలు చంద్రబాబు, వైఎస్సాఆర్, కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేశారని తెలిపారు. గత ముప్పై ఏండ్లుగా హైదరాబాద్ నగరం అభివృద్ధి కోసం ఆ నేతలు విశేషంగా కృషి చేశారని ప్రశంసించారు. రాజకీయాలకు అతీతంగా వారు తీసుకున్న నిర్ణయాలు, అనుభవాలను తమ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని హామీ ఇచ్చారు.
గత ముప్పై ఏండ్లుగా హైదరాబాద్ నగరం అభివృద్ధికి విశేషంగా కృషి చేశారని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా వారు తీసుకున్న నిర్ణయాలు, అనుభవాలను తమ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని చెప్పారు. రీజనల్ రింగు రోడ్డును త్వరలోనే తీసుకు రాబోతున్నామని చెప్పారు. రింగ్ రోడ్డు చుట్టూ రైలు సదుపాయాన్ని కూడా తీసుకు వస్తున్నామని వివరించారు. అనుభవజ్ఞులు, నిపుణుల సలహాలతో ముందుకెళతామని వెల్లడించారు. మెట్రో, ఫార్మాసిటీలు రద్దు కాలేదన్నారు.
ప్రజలకు ఉపయోగపడేలా మెట్రో విస్తరణ చేయబోతున్నామని వివరించారు. కొత్త ఫార్మా విలేజ్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. ఫార్మా సిటీ కట్టలేదని కొంత మంది ఆరోపణలు గుప్పిస్తున్నారంటూ మండిపడ్డారు. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు పక్కన ప్రమాదకర ఔషదాల తయారీ కంపెనీ ఏర్పాటు సరైనది కాదని వెల్లడించారు. ఫార్మాను మీరు సిటీలో ప్లాన్ చేస్తే తాము పల్లెలో ఏర్పాటు చేసేందుకు ప్రణాళికులు చేస్తున్నామని పేర్కొన్నారు.
10 నుండి 15 విలేజ్‌లలో ఫార్మాసిటీలను ప్లాన్ చేస్తున్నాం. అగ్ని ప్రమాదం జరిగినపుడు అందరికంటే ముందు ఘటన స్థలంలో ఉండేది ఫైర్ డిపార్ట్ మెంట్ కొనియాడారు. తమ ప్రాణాలకు తెగించి ప్రజలను అగ్నిమాపక సిబ్బంది కాపాడుతారని అన్నారు. ఎన్నో వేలాది నిర్మాణాలకు అనుమతులు ఇచ్చే అగ్నిమాపక శాఖకు భవనం లేకపోవడం సరికాదన్నారు. ఏ నగరంలో శాంతి భద్రతలు ఉంటాయో అక్కడ అభివృద్ధి చెందుతుందని చెప్పారు.