సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy) వికారాబాద్ జిల్లా కొడంగల్లో రేపు(బుధవారం) పర్యటించనున్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గానికి( Kodangal Constituency ) ఆయన సీఎం హోదాలో రావడం ఇదే తొలిసారి.
మేరకు కోస్గిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో అధికారులతో పాటు కాంగ్రెస్ పార్టీ(Congress party ) శ్రేణులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు.
ప్రస్తుతం సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. సాయంత్రం వరకు రాష్ట్రానికి చేరుకుంటారు. కాగా ఇదివరకే తన సొంత సెగ్మెంట్లో పర్యటించాలని రేవంత్ నిర్ణయించినా వివిధ కారణాలతో చివరి నిమిషంలో రెండు సార్లు వాయిదా పడింది. ఈ క్రమంలో రేపటి పర్యటన ఖరారు కావడంతో అధికారులు అన్ని ఏర్పాటు పూర్తి చేస్తున్నారు.
తెలంగాణ ఏర్పాటై పదేళ్లు గడిచినా కొడంగల్ నియోజకవర్గం అభివృద్ధికి ఆమడంత దూరంలో ఉంది. రాజకీయ కారణాలతో ఇక్కడ అభివృద్ధిని గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. ఇటీవల ప్రభుత్వం మారి ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన రేవంత్రెడ్డి అనూహ్యంగా సీఎం కావడంతో పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. అభివృద్ధికి ఒక్కో అడుగు ముందుకు పడుతోంది.