అయోధ్య (Ayodhya)లో మహార్షి వాల్మీకి ఎయిర్ పోర్టు (Valimiki Airport) అందరినీ ఆకట్టుకుంటోంది. అయోధ్య విమానాశ్రయం టెర్మినల్ భవనం ముందు భాగం ఆలయ నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తుంది.
ఈ ఎయిర్ పోర్టు రామాయణ కళతో ఉట్టిపడుతోంది. విమానాశ్రయంలోని ఫేజ్-1ను రూ. 1450 కోట్లతో నిర్మించారు. అద్భుతమైన కళాఖండానికి కేంద్రంగా ఆ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేశారు.
ఈ ఎయిర్‌పోర్టులో రామాయణాన్ని ఆధారంగా చేసుకుని పలు చిత్రాలను ఎయిర్‌పోర్టు లాబీల్లో చిత్రకారులు అద్భుతంగా డిజైన్ చేశారు. స్థానికంగా ఉపయోగించే రంగులతో ఆ కథా చిత్రాలను ఎయిర్‌పోర్టు లాబీల్లో వేశారు. ఈ చిత్రాల ద్వారా రామయణాన్ని కళ్లకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేశారు. ఎయిర్ పోర్టును విపుల్ వర్షనే డిజైన్ చేశారు.
ఉత్తర భారత్ లో కల్పించే నగర శిల్ప శైలిలో విమానాశ్రయాన్ని నిర్మించారు. శ్రీరాముడి జీవిత విశేషాలను ఆధారంగా చేసుకుని ఏరో డ్రోమ్ స్ట్రక్చర్ నిర్మాణం చేశారు. ఏడు శిఖరాలు ఉండే రీతిలో ఎయిర్ పోర్టును రూపొందించారు.
వాల్మీకి రచించిన రామాయణంలోని ఏడు కాండలను ప్రతిబింబించేలా విమానాశ్రయాన్ని అభివృద్ది చేశారు. ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మికతను నింపేలా రామాయణ ఆర్ట్ వర్క్ ఉంది.
దీంతో పాటు అత్యాధునిక సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ఇందులో ఇన్స్యూలేటెడ్ రూఫ్, ఎల్ఈడీ లైటింగ్, వర్షపు నీటిని ఒడిసి పట్టేలా ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు.
దీంతో పాటు వాటర్ ఫౌంటెయిన్స్, సీవేజ్ ట్రీట్ మెంట్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు, సోలార్ పవర్ ప్లాంట్ వంటి వ్యవస్థలు ఇందులో ఉన్నాయి.