Telugu News » Mulugu : జిల్లాకొచ్చిన మంత్రి.. పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యే!

Mulugu : జిల్లాకొచ్చిన మంత్రి.. పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యే!

ఈ టర్మ్ చివరగా అయినా వైద్య కళాశాల ఇస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు సీతక్క. అనేక పోరాటాల తర్వాత మల్లంపల్లి మండలం ప్రకటించారని.. ఈ పోరాటంలో ప్రధాన భూమిక పోషించిన జగదీష్ పేరు మీద జేడీ మల్లంపల్లిగా పేరు పెట్టాలని డిమాండ్ చేశారు.

by admin
Congress MLA Seethakka Fire On Police

అభివృద్ధి కార్యక్రమాల కోసం మంత్రులు జిల్లాలకు వెళ్లడం.. వాటిలో స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొనడం కామన్. గురువారం మంత్రులు హరీష్ రావు (Harish Rao), సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ ములుగు జిల్లాకు వెళ్లారు. జిల్లాలో మెడికల్ కాలేజీ, డిగ్రీ కాలేజ్, 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాప‌న చేశారు. ప్రోటోకాల్ ప్రకారం స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క (Seethakka) కూడా పాల్గొన్నారు. సభా వేదికపై ప్రసంగించారు.

Congress MLA Seethakka Fire On Police

ఈ టర్మ్ చివరగా అయినా వైద్య కళాశాల ఇస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు సీతక్క. అనేక పోరాటాల తర్వాత మల్లంపల్లి మండలం ప్రకటించారని.. ఈ పోరాటంలో ప్రధాన భూమిక పోషించిన జగదీష్ పేరు మీద జేడీ మల్లంపల్లిగా పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. అలాగే, తమ ప్రాంతానికి గోదావరి నీళ్లు రాలేదని.. అనేకసార్లు అసెంబ్లీలో, బయట అడుగుతున్నామని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చి ఇన్నేళ్లయినా నీళ్లు సాధించలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. పోడు భూముల కోసం ఎన్నో పోరాటాలు జరిగాయని.. ఇన్నాళ్లకు పట్టాలు పంపిణీ చేశారని.. ఇంకా రావాల్సిన వాళ్లు చాలామందే ఉన్నారని తెలిపారు.

మరోవైపు, హరీష్ రావు పర్యటన నేపథ్యంలో వినతిపత్రం ఇచ్చేందుకు వస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై సీతక్క ఫైరయ్యారు. కొండ్రాయి గ్రామంలో ఇళ్లు కోల్పోయిన మహిళలను పోలీసు స్టేషన్‌ లో ఉంచారని తెలిసి అక్కడకు వెళ్లారు. ఉన్నతాధికారులకు ఫోన్ చేసిన ఎమ్మెల్యే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇండ్లు కోల్పోయిన బాధితులు మంత్రిని కలిసేందుకు వస్తే అదుపులోకి తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు. ‘‘మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేక, పాకిస్తాన్‌ లో ఉన్నామా?’’ అని నిలదీశారు.

తమ పార్టీ కార్యకర్తలను, ప్రజా సంఘాల నాయకులను అరెస్టులు చేశారని సీతక్క మండిపడ్డారు. మంత్రి వస్తున్నప్పుడు వినతిపత్రం కూడా అందజేసే స్వేచ్ఛ లేకుంటే ఎలా అని ప్రశ్నించారు. మంత్రి పాల్గొంటున్న కార్యక్రమం ప్రజాధనంతో పెడుతున్నారని.. కోటి రూపాయలు ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. పార్టీ మీటింగ్‌ అయితే తాము కూడా పట్టించుకునే వాళ్లం కాదని.. అది ప్రజల సొమ్ముతో పెట్టిన మీటింగ్ అని తెలిపారు సీతక్క. పోలీసుల చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టుగా చెప్పారు.

You may also like

Leave a Comment