తెలంగాణ (Telangana) సీఎం (CM) ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయడానికి ముందు పార్టీ అభ్యర్థులకు క్లాస్ ఇచ్చినట్టు, అంతే కాకుండా అహంకారం ప్రదర్శించడం వల్లే గత ఎన్నికల్లో జూపల్లి ఓడిపోయారని కేసీఆర్ (KCR) అన్నట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ నేత జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) ఘాటుగానే స్పందించారు. ఎన్నికలు రాగానే కేసీఆర్ వేషాలు మారుస్తున్నారని, నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే అని, ఆయన మాట మీద నిలబడే వ్యక్తి కాదని విమర్శించారు.
సీఎం కేసీఆర్ తన కాలి గోటికి కూడా సరిపోరని, ఏ విషయంలో తన కంటే గొప్పోడని జూపల్లి మండిపడ్డారు. నన్ను వేలు పెట్టి చూపించే హక్కు నీకు లేదు అని సీఎం పై ఫైర్ అయ్యారు జూపల్లి.. ఎలక్షన్లు రాగానే పగటి వేషగాడి లెక్క రంగులు మారుస్తున్న సీఎం కేసీఆర్ కట్టించింది ప్రగతి భవన్ కాదని.. బానిస భవన్ అని విమర్శించారు.
అందరికీ దళిత బంధు ఇవ్వకుండా బీఆర్ఎస్ నేతలు దళిత బంధు పేరుతో మోసం చేస్తున్న పట్టించుకోవడం లేదని, తెలంగాణ కోసం త్యాగం చేసిన అమర వీరుల కుటుంబాల ఊసే లేదని మండిపడ్డారు. ఇష్టారితిగా డబ్బులు ఖర్చు పెడుతూ ఇతర పార్టీ నేతలను మేనేజ్ చేసుకుంటుంది మీరని జూపల్లి కదం తొక్కారు. రెండేళ్లలో 2 వేల కోట్లు ఇవ్వలేని వారు.. 20 రోజుల్లో లక్ష కోట్లు ఎలా తెస్తారని ప్రశ్నించారు. ఈ విషయంలో కేటీఆర్, హరీష్ మీలో ఎవరు చర్చకు వస్తారో రండి అని జూపల్లి సవాల్ విసిరారు..