రాష్ట్రంలో ప్రభుత్వ సలహాదారుల నియామకాలను కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం రద్దు చేసింది. ఈమేరకు తెలంగాణ (Telangana) ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో నియమితులైన ప్రభుత్వ సలహాదారుల నియామకాలను రద్దు చేస్తూ శనివారం ఉత్వర్వులు జారీ చేశారు. సలహాదారులుగా బీఆర్ఎస్ హయాంలో జరిగిన వీరి నియామకాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
గత ప్రభుత్వంలో సలహాదారులుగా వ్యవహరించిన.. సోమేశ్ కుమార్, రాజీవ్ శర్మ, ఎస్కే జోషి, కేవీ రమణా చారి, శోభ, అనురాగ్ శర్మ, ఏకే ఖాన్, జీఆర్ రెడ్డి, శివశంకర్, సుధాకర్ తేజ, చెన్నమనేని రమేష్, రాజేంద్ర ప్రసాద్ సింగ్, శ్రీనివాస్ రావు నియామకాలు రద్దు చేస్తూ సీఎస్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించే క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్టు సమాచారం. గత ప్రభుత్వం పై అవినీతి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో వారికి సహకరించిన అధికారులపై రేవంత్ దృష్టి సారించినట్టు ప్రచారం జరుగుతుంది.. ఈ క్రమంలో పలువురు అధికారుల పై వేటుపడే సూచనలు కనిపిస్తున్నట్టు జోరుగా చర్చలు సాగుతున్నాయి..
మరోవైపు ఆరు గ్యారెంటీల అమలుపై కూడా రేవంత్ రెడ్డి కసరత్తు ప్రారంభినట్టు సమాచారం. ఇప్పటికే రెండు గ్యారెంటీలు అమల్లోకి తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం.. మొత్తానికి రేవంత్ సైన్యం రాష్ట్ర పాలనలో గుడ్ టాక్ తెచ్చుకుంటారో.. లేదా బీఆర్ఎస్ (BRS) చేసిన ప్రచారం నిజం చేస్తారో కొన్ని రోజులు ఆగితే తెలుస్తుందని జనం టాక్..