రాష్ట్రంలో జరుగుతున్న పొలిటికల్ వార్ వేసవి వేడిని తలపించేలా ఉంది.. ఇప్పటికే కారు నేతలకు.. హస్తం నేతలకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా డైలాగ్ వార్ సాగుతుండగా.. తాజాగా కాంగ్రెస్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. గత ప్రభుత్వం భారీగా అవినీతికి పాల్పడిందని కాంగ్రెస్ నేతలు మండిపడుతుండగా.. అసత్య ఆరోపణలు చేస్తున్నారని బీఆర్ఎస్ వాదిస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా తప్పించుకోవాలని చూస్తోందని ఆరోపణలు చేస్తోంది..
ఈ నేపథ్యంలో పొలిటికల్లో హిట్ పెరిగేలా తెలంగాణ (Telangana) కాంగ్రెస్ పార్టీ సంచలన ట్వీట్ చేసింది. కేసీఆర్ (KCR) ఇగ ఎట్ల రావాలే మీకు బుద్ధి..? అని ట్వీట్ లో పేర్కొంది.. మరోవైపు మేడిగడ్డ డిజైన్, నాణ్యత, నిర్వహణ లోపభూయిష్టంగా ఉందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు, యావత్ మీడియా, ఇంజనీరింగ్ నిపుణులు అంతా ముక్త కంఠంతో వెల్లడిస్తున్నారు. కానీ బీఆర్ఎస్ (BRS) స్వయం ప్రకటిత మేధావులు మాత్రం అదో అద్భుతం అంటున్నారని పేర్కొంది.
జనం ఊంచితే ఊంచిరి మాకేం అన్నట్టు.. నిస్సిగ్గుగా వ్యవహరించడం బీఆర్ఎస్ కే సాధ్యం. యావత్ తెలంగాణ సమాజం సిగ్గుపడుతుంది. ఇలాంటి దొంగల ముఠాకా ఇన్నేళ్లు మేం అధికారం అప్పజెప్పిందని. తెలంగాణ ప్రజలని నిర్బంధించి, మీ బానిసలుగా చూశారు. ఈ పాపం ఊరికే పోదు. తస్మాత్ జాగ్రత్త అని ట్వీట్ లో పేర్కొంది. ఇదిలా ఉండగా ప్రధాని మోడీపై సైతం T-కాంగ్రెస్ ట్విట్టర్ వేదికగా ఫైర్ అయింది. మోడీని ‘స్పీడ్ బ్రేకర్’గా అభివర్ణించింది.
పేదలకు సాధికారత కల్పించడం ద్వారా అభివృద్ధిని కాంగ్రెస్ (Congress) వేగవంతం చేసింది, అయితే నరేంద్ర మోడీ (Narendra Modi).. కొద్దిమంది స్నేహితుల ప్రయోజనాల కోసం దేశాన్ని ఖాళీ చేస్తున్నారని పేర్కొంది. విధానాల్లో దేశ ప్రజలను అగ్రగామిగా ఉంచకుండా దేశాభివృద్ధి అసాధ్యం అని తెలిపింది.. ఇందుకు గణాంకాలే నిదర్శనం అని ట్వీట్ చేసింది.