Telugu News » Cpi Narayana: బర్రెలక్క‌కు బీఆర్ఎస్ ప్రభుత్వం భయపడుతోంది: సీపీఐ నారాయణ

Cpi Narayana: బర్రెలక్క‌కు బీఆర్ఎస్ ప్రభుత్వం భయపడుతోంది: సీపీఐ నారాయణ

బర్రెలక్క(Barrelakka) ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతోందని.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆమెను చూసి భయపడుతోందని సీపీఐ నేత నారాయణ (CPI Leader Narayana) అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

by Mano
cpi narayana brs bjp will always be one

కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన బర్రెలక్క(Barrelakka) ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతోందని.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆమెను చూసి భయపడుతోందని సీపీఐ నేత నారాయణ (CPI Leader Narayana) అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

cpi narayana brs bjp will always be one

ఖమ్మం జిల్లాలో మొదట ఓడేది పువ్వాడ అజయ్‌ అని నారాయణ అన్నారు. ఆయనకు అహం బాగా పెరిగిపోయిందని, తండ్రికి మూడు నామాలు పెట్టిన వారు ఎవరైనా ఉన్నారు అంటే అది అజయ్‌నే అని.. తండ్రినే మోసం చేశారని విమర్శించారు. సీపీఎం, సీపీఐ లిస్ట్‌కు ఎలాంటి కాంట్రవర్సీ లేదని ఇండియా కూటమిలో తాము భాగస్వాములమని నారాయణ స్పష్టం చేశారు.

ప్రియాంకగాంధీ సభలో తాము పాల్గొంటున్నట్లు వెల్లడించారు. ఇవాళ జాతీయ నాయకులు టి.రాజా ఖమ్మం వస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ వాళ్ళు చాలా ముదుర్లని, ఐదు సీట్లు అడిగితే తమకు ఒక్క సీటే కేటాయించారని ఆరోపించారు. వివేక్ గద్దలా తమకు కేటాయించాల్సిన సీటు ఎత్తుకుపోయారని విమర్శించారు.

బీజేపీ అనుకూలంగా ఉన్నవారు ఎంతటి క్రూరుడైనా బయట తిరుగుతాడని, ఆ పార్టీని వ్యతిరేకించే వాళ్లు మాత్రం ఎంతటి మంచివాడు అయినా జైలుకు వెళ్లాల్సిందేనా? అంటూ నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజాసింగ్ కరుడుగట్టిని హిందుత్వవాదని నారాయణ అన్నారు. బీజేపీని, మోదీని తూలనాడిన కేసీఆర్ ఇప్పుడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారని ప్రశ్నించారు.

తాము మునుగోడు ఎన్నికల్లో బీఆర్ఎస్‌తో కలిసి ఎన్నికలకు వెళ్లామని నారాయణ గుర్తుచేశారు. సీఎం కేసీఆర్‌ నియంతలా వ్యవహరిస్తున్నారని, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కేసీఆర్ విస్మరించారని అన్నారు. చంద్రబాబు అరెస్ట్ చట్ట విరుద్ధమని.. దానిని అందరూ ఖండించినా కేవలం సీఎం కేసీఆర్ మాత్రం తమకు సంబంధం లేదంటూ ఎద్దేవా చేశారని విమర్శించారు. ముఖ్యమంత్రి నీళ్ళు లేని బావిలో దూకిచావచ్చు..’ అంటూ నారాయణ విరుచుకుపడ్డారు.

You may also like

Leave a Comment