Telugu News » AQI : ఢిల్లీలో క్షీణించిన వాయు నాణ్యత… మరోసారి తీవ్ర స్థాయికి పడిపోయిన ఏక్యూఐ…!

AQI : ఢిల్లీలో క్షీణించిన వాయు నాణ్యత… మరోసారి తీవ్ర స్థాయికి పడిపోయిన ఏక్యూఐ…!

తాజాగా ఏక్యూఐ తీవ్ర ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఈ రోజు ఉదయం 7.05 గంటలకు ఢిల్లీలో ఏక్యూఐ 401తీవ్ర స్థాయిలో చేరుకుందని అధికారులు తెలిపారు.

by Ramu

దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో వాయు నాణ్యత మరింత పడిపోయింది. ఢిల్లీలో గత ఆరు రోజులుగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) అత్యంత పేలవం (Very Poor)గా ఉంది. తాజాగా ఏక్యూఐ తీవ్ర ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఈ రోజు ఉదయం 7.05 గంటలకు ఢిల్లీలో ఏక్యూఐ 401తీవ్ర స్థాయిలో చేరుకుందని అధికారులు తెలిపారు.

ఇక ఆనందర్ విహార్ ప్రాంతంలో ఏక్యూఐ 418గా నమోదైనట్టు పేర్కొన్నారు. ఆర్కే పురం 424, అలీపూర్ 434, అశోక్ విహార్ 427, భవనా 456, ద్వారకా సెక్టార్ 399, ఐజీఐ 391, ఐటీఓ 356, జహంగిరి పురి 445, జేఎల్ఎన్ స్టేడియం 385, లోధీ రోడ్ 356, నరేలా 422, నజాఫ్ ఘర్ 385, న్యూ మోతీ బాగ్ 399, ఓక్లాలో 415 గా నమోదైనట్టు వెల్లడించారు.

అదే సమయంలో ప్రతాప్ గంజ్ 416, పంజాబీ బాగ్ 433, రోహిణీ 438, షాదీపూర్ 366, వివేక్ విహార్ 444, వజీర్ పూర్ 448గా ఉంది. ఇక నోయిడాలోని సెక్టార్ 125లో 353, సెక్టార్ 62లో 367, సెక్టార్ 1లో 341, సెక్టార్ 116లో 319గా రికార్డు అయింది. ఢిల్లీలో ఏక్యూఐ శుక్రవారం కూడా అత్యంత పేలవంగా ఉంటుందని, శనివారం నాటికి అది తీవ్ర స్థాయికి చేరుతుందని,

మళ్లీ చాలా పేలవకరంగా మారే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. కానీ ఒక రోజు ముందుగానే ఏక్యూఐ తీవ్ర స్థాయికి చేరుకోవడం గమనార్హం. బుధవారంతో పోలిస్తే ఏక్యూఐ నిన్న స్వల్పంగా మెరుగుపడింది. 24 గంటల్లో ఢిల్లీ సరాసరి వాయు నాణ్యగత గురువారం 390 (అత్యంత పేలవంగా) ఉందని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు వెల్లడించింది. అంతకు ముందు బుధవారం సరాసరి ఏక్యఐ 395(అత్యంత పేలవం)తో పోలిస్తే కాస్త మెరుగుపడినట్టు తెలిపింది.

You may also like

Leave a Comment