రాజధాని ఢిల్లీ(Delhi)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. బిర్యానీ(Biryani) కోసం 16ఏళ్ల బాలుడు తోటి స్నేహితున్ని పొడిచి చంపాడు. అతడి ఛాతిపై ఒకటి, రెండు సార్లు కాదు.. ఏకంగా 60 సార్లు పొడిచి అతి కిరాతకంగా హతమార్చాడు. అంతే కాదు, ఈ హత్య అనంతరం మృతదేహం(Dead body) వద్ద నిందితుడు డ్యాన్స్ చేయడం కలకలం రేపింది.
ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన ఢిల్లీలోని వెల్‌కమ్ ఏరియాలో బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వీరిద్దరూ స్కూల్ డ్రాప్ అవుట్ అని పోలీసులు గుర్తించారు. అదేవిధంగా నిందితుడిపై ఇది వరకే ఓ హత్యకేసు నమోదై ఉంది. ఈ ఘటనకు సంబంధించిన ఒకటిన్నర నిమిషాల నిడివి ఉన్న సీసీఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు.
నిందితుడి కుటుంబం స్వాగత ప్రాంతంలోని జాఫ్రాబాద్ సమీపంలోని మురికివాడలో ఉంటోంది. అయితే, జనతా మజ్దూర్ కాలనీ సమీపంలో ఉంటున్న అతడి స్నేహితున్ని బిర్యానీ తినేందుకు రూ.350 అడిగాడు. దీంతో ఆ బాలుడు ఇవ్వనని చెప్పడంతో నిందితుడు అతడిపై దాడి చేసి డబ్బు లాక్కునేందుకు ప్రయత్నించాడు.
ఎంతకీ డబ్బు ఇవ్వకపోవడంతో నిందితుడు తొలుత అతడి గొంతు నులిమి హతమార్చేందుకు ప్రయత్నించాడు. ఆ తర్వాత జేబులో ఉన్న కత్తితో దాడికి పాల్పడ్డాడు. నిందితుడు అతన్ని కత్తితో మొత్తం 60సార్లు పొడిచాడు. బాధితుడు రక్తపు మడుగులో డ్యాన్స్ చేశాడు. అతడి కాలు పట్టుకుని ఒక వైపు లాగడం మొదలుపెట్టాడు.
ఇది చూసిన స్థానికులు వెంటనే బాధితున్ని జీటీబీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వైద్యులు పరీక్షించి అతడు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. అనంతరం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.