ఢిల్లీ (Delhi) లిక్కర్ స్కామ్ (Liquor Scam) కేసు కీలక మలుపు తీసుకొంది. చివరికి సీఎం క్రేజీవాల్ (CM Kejriwal) అరెస్ట్ దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. అయితే ఢిల్లీ సీఎం అరెస్ట్ ను కొందరు రాజకీయ నేతలు ఖండిస్తున్నారు.. ఈ క్రమంలో అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ పై సామాజిక వేత్త అన్నా హజారే (Anna Hazare) స్పందించారు.. ఆయన తప్పు చేసారు కాబట్టే అరెస్ట్ అయ్యారని పేర్కొన్నారు.
అరవింద్ కేజ్రీవాల్ , సిసోడియా నాతో ఉన్నపుడు దేశ సంక్షేమానికి ఎప్పుడు ముందు ఉండాలని వారికి చెప్పినట్లు తెలిపారు.. అదేవిధంగా కొత్త మద్యం పాలసీ విషయమై కేజ్రీవాల్‌కు రెండు సార్లు లేఖలు రాశాను.. కానీ ఆయన ఈ విషయాన్ని పట్టించుకోలేదని హజారే పేర్కొన్నారు. అప్పుడు అతను నా మాట వినలేదు కాబట్టి ఇప్పుడు నేను అతనికి ఎటువంటి సలహా ఇవ్వనన్నారు.. ఈ విషయంలో చట్టం తనపని తాను చేస్తుందని తెలిపారు.
మరోవైపు నాతో కలిసి పనిచేసే సమయంలో లిక్కర్ కు వ్యతిరేకంగా మాట్లాడిన క్రేజీవాల్ నేడు లిక్కర్ పాలసీలు చేయడం దురదృష్టకరమని తెలిపారు.. ఆయనతో కలిసి పని చేసినందుకు సిగ్గుపడుతున్నానని హజారే వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితికి బాధగా అనిపించడం లేదన్నారు.. అదేవిధంగా కేజ్రీవాల్ పుస్తకం ‘స్వరాజ్’ నుంచి ఉటంకిస్తూ, హజారే మద్యంపై తన మునుపటి వైఖరిని గుర్తు చేయాలనుకొంటున్నట్లు తెలిపారు.
ఢిల్లీ ప్రభుత్వ విధానం వల్ల మద్యం వినియోగం, విక్రయాలు పెరగడంతో పాటు అవినీతి పెరిగే అవకాశం ఉందని.. ఇదంతా ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుందని అన్నట్లు హజారే పేర్కొన్నారు. ఆ సమయంలో కేజ్రీవాల్‌కు రాసిన లేఖలో, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తాను తన ఆదర్శాలను మరచిపోయి, అధికారంలో మత్తులో ఉన్నానని తెలిపినట్లు గుర్తు చేశారు..
మరోవైపు 2011లో లోక్‌పాల్‌ను నియమించాలని డిమాండ్ చేస్తూ హజారే ప్రారంభించిన చారిత్రాత్మక భారత అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమంలో ఎక్సైజ్ పోర్ట్‌ఫోలియోను నిర్వహిస్తున్న డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, మాజీ ఆప్ సభ్యులు యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ మరియు కుమార్ విశ్వాస్‌లతో పాటు కేజ్రీవాల్ భాగంగా ఉన్నారు. ఆసమయంలో హజారే లేఖ గురించి కేజ్రీవాల్ ను ప్రశ్నించినప్పుడు..
పంజాబ్ ఎన్నికల సమయంలో కేజ్రీవాల్‌ను ఉగ్రవాది అన్నారు. ప్రజలు వారిని చూసి నవ్వడం ప్రారంభించడంతో, కుమార్ విశ్వాస్ను ముందుకు తీసుకువచ్చి చెప్పించారు. ఇప్పుడు ఎక్సైజ్ పాలసీలో స్కామ్ ఉందని, సీబీఐ ఏమీ కనిపెట్టలేదని, అనధికారికంగా క్లీన్ చిట్ ఇచ్చిందన్నారు. జనం తమ మాట వినడం లేదు కాబట్టి ఇప్పుడు అన్నా హజారే భుజం మీద నుంచి కాల్పులు జరుపుతున్నారు. ఇదీ రాజకీయం అని కేజ్రీవాల్ మాట్లాడినట్లు హజారే వెల్లడించారు..