ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Liquor Scam)లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.. హవాలా మార్గాలో డబ్బులు తరలింపు జరిగినట్లు కవిత (Kavitha) మాజీ పీఏ అశోక్ కౌశిక్ అంగీకరించారు.. అభిషేక్ బోయినపల్లి సూచన మేరకు హవాలా మార్గంలో గోవాకు భారీగా డబ్బులు తరలించినట్లు తెలిపారు. అదీగాక కౌశిక్ ద్వారా 25 కోట్లు డెలివరీ అయినట్లు కాల్ రికార్డ్స్ లో స్పష్టమైనట్లు తెలుస్తోంది.
ఆ డబ్బంతా గోవా అసెంబ్లీ ఎన్నికలకు ఆప్ నేతలు ఉపయోగించారని.. ఇండో స్పిరిట్ లో కవిత భాగస్వామి అనేందుకు కూడా ఆధారాలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.. అలాగే ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో రిటైల్ జోన్ లో రెండు జోన్లు కు అవకాశం ఉండగా శరత్ చంద్రారెడ్డికి ఐదు జొన్లు దక్కాయిని.. ఇందుకు కవితా శరత్ చంద్రారెడ్డి మధ్య 14 కోట్ల రూపాయల లావాదేలకు సంబంధించి బ్యాంక్ రికార్డ్స్ ఉన్నట్లు పేర్కొన్నారు..
తెలంగాణలోని మహబూబ్ నగర్ వద్ద ఒక వ్యవసాయ భూమి కొనుగోలుకు సంబంధించిన అంశంలో కవిత, శరత్ చంద్రారెడ్డిని ఒత్తిడి చేశారని అధికారులు తెలిపారు.. అలాగే ఆప్ నేతలకు తానే 100 కొట్లు అందించినట్లు తెలిపిన కవిత.. మీకు 5 రిటైల్ జోన్ లో వ్యాపారం దక్కింది కాబట్టి జోనుకు ఐదు కోట్లు చొప్పున 25 కోట్లు నాకు ఇవ్వాలని శరత్ చంద్రారెడ్డిని డిమాండ్ చేసినట్లు సీబీఐ (CBI) అధికారులు వెల్లడించారు.
కానీ శరత్ చంద్రారెడ్డి 25 కోట్లు ఇచ్చేందుకు నిరాకరించారని.. అయితే తెలంగాణ (Telangana), ఢిల్లీ (Delhi)లో వ్యాపారాలు చేయనివ్వనని కవిత బెదిరించినట్లు అధికారులు తెలిపారు.. మరోవైపు తన రిటైల్ జోన్స్ కు ఇండో స్పిరిట్ నుంచి రావాల్సిన 60 కోట్లు ఇవ్వద్దని కవిత తన బినామీ పిళ్ళైకి తెలిపినట్లు శరత్ చంద్రారెడ్డి వెల్లడించారు.. మరోవైపు వారు ముగ్గురు చెప్పిన దాని ప్రకారం ఈ కేసులో కవితే ప్రధాన కుట్రదారని మరింత లోతుగా ప్రశ్నించాల్సింది కాబట్టి కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోరుతున్నట్లు సీబీఐ పేర్కొంది..
ఇదిలా ఉండగా సౌత్ గ్రూపులో మద్యం వ్యాపారి అంటూ పరోక్షంగా మా గుంట శ్రీనివాస్ రెడ్డి పేరును ప్రస్తావించిన సీబీఐ.. 100 కోట్ల ముడుపులని సేకరించడంలోనూ ఆప్ నేతలకు చెల్లించడంలోనూ కవిత నేరపూరిత కుట్రకు పాల్పడినట్లు పేర్కొంది. అలాగే ఆప్ నేతలకు ఇవ్వడం కోసం 100 కోట్లు కావాలని వెంటనే 50 కోట్లు ఏర్పాటు చేయాలని కవితా మద్యం వ్యాపారి దినేష్ అరోరాను కోరినట్లు తెలిపారు.
ఆయన తన కుమారుడి ద్వారా 25 కోట్ల రూపాయలను అభిషేక్ బోయినపల్లి ద్వారా సమకూర్చినట్లు ఆ డబ్బులు గోవా ఎన్నికలకు తరలించినట్లు అప్రూవర్ గా మారిన దినేష్ అరోరా వెల్లడించారు.. కాగా మొదట లిక్కర్ వ్యాపారం చేయాలనుకున్నప్పుడు అరవింద్ కేజ్రీవాల్ కలిస్తే.. కవిత అంతా సమన్వయం చేస్తున్నారని ఆయన పేర్కొన్నట్లు తెలిపారు..