లిక్కర్ స్కామ్ (Liquor Scam)లో అరెస్టై.. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ (Delhi) సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు మండోలి జైలు నుంచి సుకేశ్ చంద్రశేఖర్ (Sukesh Chandrashekhar).. మరో లేఖ రాశారు. ఇప్పటికే పలు లేఖలు విడుదల చేసిన ఆయన.. ఈ సారి కాస్త డిఫరెంట్ గా రైమ్స్ అల్లాడు.. కేజ్రీవాల్ ఆరోగ్యం, డ్రామాపై తనదైన శైలిలో స్పందించినా ఆయన.. కొద్దిరోజులుగా మీ డ్రామా, ఆస్కార్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ లను చూసి తట్టుకోలేకపోతున్నా అని పేర్కొన్నారు..

మరోవైపు తీహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్ (Kejriwal)ఎంజాయ్ చేస్తూనే.. సానుభూతి కోసం డ్రామా ఆడుతున్నారని విమర్శించిన సుఖేశ్.. మెడికల్ బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించాడు. కేజ్రీవాల్ ఎవరిని మోసం చేస్తున్నాడో ప్రజలు గమనిస్తూ ఉంటారని, వాళ్లు అంత తేలికగా మోసపోరని పేర్కొన్నారు. లిక్కర్ కేసులోనే కాకుండా.. ఇంకా అనేక కేసుల్లో ఆయన నిందితుడిగా ఉన్నారన్నారు.. త్వరలోనే శిక్ష పడుతుందని తెలిపారు..