గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది క్రైమ్ రేట్ (Crime Rate) పెరిగిందని డీజీపీ రవి గుప్తా (DGP Ravi Gupta) వెల్లడించారు. ఈ ఏడాది క్రైమ్ రేట్ 8.97 శాతం పెరిగిందని తెలిపారు. ఈ ఏడాది 2,13,121 కేసులు నమోదు చేశామన్నారు. ఈ ఏడాదిలో 1108 జీఆరో ఎఫ్ఐఆర్ నమోదు చేశామని చెప్పారు. ఈ ఏడాది సైబర్ క్రైమ్ నేరాలు 17. 59 శాతం పెరిగాయన్నారు.
వార్షిక నివేదికను డీజీపీ రవి గుప్తా శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ…..రాష్ట్రంలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వాహించామని, పోలీస్ సిబ్బంది, మీడియా సహకారంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేయగలిగామన్నారు. ఈ ఏడాది క్రైమ్ రేట్ 8,97 శాతం పెరిగిందని గణాంకాలను విడుదల చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా 1,360 మాదక ద్రవ్యాల కేసులన నమోదు చేశామని, గతంతో పోలిస్తే ఈ ఏడాది 15.6 శాతం మాదక ద్రవ్యాల కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణకు యాంటీ నార్కోటిక్ బ్యూరో ఏర్పాటు చేశామని చెప్పారు. 2,52,60 కేజీల గంజాయి, 1240 గంజాయి మొక్కలను సీజ్ చేశామని, దీనికి సంబంధించి 2583 మందిని అరెస్ట్ చేశామన్నారు.
‘59 మాదక ద్రవ్యాల కేసుల్లో 182 మందిని అరెస్ట్ చేశాం. 175 మంది మాదక ద్రవ్యాల విక్రేతలపై పీడీ యాక్ట్ ప్రయోగించాం. 12 మంది విదేశీ నేరస్తులను అరెస్టు చేశాం. 536 మంది మాదక ద్రవ్యాల వినయోగదారులకు కౌన్సెలింగ్ ఇచ్చాం. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 1877 ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టాం. ఐపీసీ సెక్షన్ కింద 1,38,312 కేసులు నమోదు చేశాం’ డీజీపీ రవి గుప్తా వెల్లడించారు.