Telugu News » Dhaksha Drone : ఇండియన్ ఆర్మీ కోసం దక్ష డ్రోన్… ఇక ఎత్తైన ప్రాంతాల్లో ఆహార తరలింపు సులువు….!

Dhaksha Drone : ఇండియన్ ఆర్మీ కోసం దక్ష డ్రోన్… ఇక ఎత్తైన ప్రాంతాల్లో ఆహార తరలింపు సులువు….!

ఆ డ్రోన్ కు ‘దక్ష’ (Dhaksha) అని నామకరణం చేసింది. ఎత్తైన ప్రాంతాల్లో ఉండే సైనికులకు ఆహారం, ఔషదాలు అందించేందుకు ఈ డ్రోన్ ఉపయోగపడుతుందని ఏరోనాటిక్స్ విభాగం వెల్లడించింది.

by Ramu

ఎత్తైన ప్రాంతాల్లో విధులు నిర్వహించే సైన్యానికి ఉపయోగపడేలా ఓ డ్రోన్‌ (Drone)ను మద్రాస్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ ఏరోనాటిక్స్ విభాగం తయారు చేసింది. ఆ డ్రోన్ కు ‘దక్ష’ (Dhaksha) అని నామకరణం చేసింది. ఎత్తైన ప్రాంతాల్లో ఉండే సైనికులకు ఆహారం, ఔషదాలు అందించేందుకు ఈ డ్రోన్ ఉపయోగపడుతుందని ఏరోనాటిక్స్ విభాగం వెల్లడించింది.

కొన్ని రోజుల ఈ డ్రోన్ ట్రయల్​ రన్ ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. అన్నా వర్శిటీ పరిధిలోని మద్రాస్ కాలేజ్​ ఆఫ్ టెక్నాలజీలోని ఏరోనాటిక్స్ విభాగం డైరెక్టర్ సెంథిల్ కుమార్ నేతృత్వంలో ఈ డ్రోన్​ను రూపొందించారు. ట్రయల్ రన్ లో భాగంగా దీన్ని వ్యవసాయ పంట పొలాల్లో క్రిమిసంహారక మందులు పిచికారి చేశారు.

ఈ డ్రోన్‌ను నదీ పరివాహక ప్రాంతాల్లో మైనింగ్, డ్రైడ్జింగ్ పనులను తనిఖీ చేయడం లాంటి కార్యకలాపాల్లో దీని పరీక్షించారు. అనంతరం ఈ నెల 15న భారత్-టిబెట్​ సరిహద్దు ప్రాంతంలో దీన్ని పరీక్షించారు. ఆ సమయంలో సైనికులకు ఆహారం అందజేయడం, ఔషదాలను అందచేయడం వంటి పనులను చేసింది.

తాజాగా ఈ దక్ష డ్రోన్​ను భారత సైన్యంలోకి కేంద్ర హోం మత్రి అమిత్ షా ప్రవేశ పెట్టారు. దీని పని తీరు సంతృప్తిగా ఉంటంతో అదనంగా మరో 500 డ్రోన్​ల రూపకల్పనకు అనుమతిచ్చారు. ఈ డ్రోన్ విజయవంతం అయిందని, 50 కిలోల వరకు పేలోడ్​ను తీసుకెళ్లే సామర్థ్యం ఉన్న డ్రోన్​లను తాజాగా తయారు చేస్తామని మద్రాస్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీలోని ఏరోనాటిక్స్ బృందం వెల్లడించింది.

You may also like

Leave a Comment