తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు కాకాపుట్టిస్తున్నాయని అంటున్నారు. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ మధ్యనే టఫ్ ఫైట్ జరగనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.. ఇప్పటికే బీజేపీ నేతలు వరుసగా హస్తం పై విమర్శలు గుప్పిస్తూ.. ఆ పార్టీ లోపాలను జనంలోకి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరిస్థితి ఆటలో అరటిపండులా మారిందని అనుకొంటున్నారు.

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి, మోడీనే గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం అనేది జరగదన్న విషయం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కి సైతం తెలుసని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని ఆదుకోవాలంటే మరోసారి బీజేపీ ప్రభుత్వమే కేంద్రంలో అధికారంలోకి రావాలని తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ 12 నుండి 15 స్థానాలు గెలుస్తుందని డీకే అరుణ వెల్లడించారు.. మూడో సారి మోడీ (Modi)నే ప్రధాని అని తన అభిప్రాయాన్ని తెలిపారు..