Telugu News » DK Aruna : మహిళలను గౌరవించమని కేసీఆర్ కు చెప్పండని ఎవరన్నారు?

DK Aruna : మహిళలను గౌరవించమని కేసీఆర్ కు చెప్పండని ఎవరన్నారు?

by Prasanna
dk aurna

మహిళా బిల్లు (Women Reservation Bill) ను  బీజేపీ (BJP) ప్రభుత్వం తెస్తుంటే అదేదో తన పోరాటాల వలనే వస్తుందని కవిత చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ (DK Aruna) అన్నారు. ముందు మహిళలను గౌరవించమని తన తండ్రి కేసీఆర్ కు కవిత చెప్పాలని అన్న అరుణ, బీఆర్ఎస్ లో మహిళలకు కనీసం 15 శాతం రిజర్వేషన్ అమలు చేశారా అని ప్రశ్నించారు.

dk aurna

దేశాభివృద్ధికి ఆటంకాలు కలగాలని కాంగ్రెస్ పార్టీ చేయడం సమంజసమా అని ప్రశ్నించిన డీకే అరుణ,  రాహుల్ గాంధీ విద్వేషాలు రెచ్చగొట్టే లా మాట్లాడాడుతున్నారని ఆరోపించారు. ప్రపంచంలో మోదీ కి వస్తున్న ఆదరణ చూసి కాంగ్రెస్ నేతలు ఏదేదో మాట్లాడుతున్నారని, గాంధీ పేరు పెట్టుకుని ఇన్నాళ్లు దేశాన్ని ఏలినా కూడా పేదరికాన్ని నిర్మూలించలేకపోయారని విమర్శించారు.

కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని, మత చిచ్చు రేపి రాజకీయాలకు వాడుకుంటుందన్నారు. తెలంగాణపై, దేశం పై కాంగ్రెస్ కు ఏమాత్రం ప్రేమ లేదని, కర్ణాటకలో ఆర్టీసీని ప్రైవేటు పరం చేసేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తుందన్నారు. బీజేపీ ఎమ్మెల్యే లు పార్టీ మారరు, తాము అధికారంలోకి వస్తే స్కాంలు ఉండవని అన్నారు.

తెలంగాణ చరిత్రను కనుమరుగు చేయం అనే హామీ కాంగ్రెస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి లో ముందుకు తీసుకువెళ్ళడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుని పని చేస్తుందని, ప్రజలు ఏం కోరుకుంటున్నారో అనే విషయాలను బీజేపీకి తెలుసునని, దానికి తగ్గట్టుగానే తమ మేనిఫెస్టో ఉంటుందని చెప్పారు. ప్రణాళికాబద్దంగా మోదీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ఉన్నారని చెప్పారు.

You may also like

Leave a Comment