హిందు సంస్కృతిలో ధార్మికంగా ప్రతినెలా వేటికవే ప్రత్యేకమైనవి. ఈ శ్రామణమాసం(Sravanamasam) మహిళలకు ఓ ప్రత్యేకమైన నెల.ఈ నెలలో ప్రతి శుక్రవారం శ్రావణలక్ష్మిని పూజిస్తారు.వరలక్ష్మి వ్రతాలు చేస్తారు.
ఈ మాసంలో చాలా మంది మాంసాహారానికి చాలా దూరంగా ఉంటూ, శాకాహారానికే ప్రాధాన్యత ఇస్తుంటారు. అయితే ఈ మాసంలో శాకాహారానికే ప్రాధాన్యత ఇవ్వడానికి కొన్ని సైంటిఫిక్ రీజన్స్(scientific reasons) ఉన్నాయని పలు శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ మాసంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది.
అంతే కాకుండా జీర్ణవ్యవస్థ(Digestive system) సక్రమంగా పని చేయదు. అందువలన మాంసం తింటే అనారోగ్య(ill health) సమస్యలు వచ్చే అవకాశాం ఉందని, మాంసాహారానికి దూరంగా ఉంటారు. అలాగే ఈ నెలలో జంతువులు ఎక్కువగా ప్రసవించడంతో వాటిని వధించడం మంచిదికాదన్న కారణంతో మాంసం తీసుకోరని చెబుతారు.