యూరప్‌లోని మాల్డోవా అధ్యక్షురాలు (Moldovan president) మైయా సందు (Maia Sandu) పెంపుడు శునకం ఆస్ట్రియా ప్రధానిని (Austrian president) కరిచింది. ఆస్ట్రియా ప్రధాని అలెగ్జాండర్ వాన్ డెర్ బెలెన్ (Alexander Van der Bellen).. ప్రస్తుతం మాల్డోవాలో పర్యటిస్తున్నారు.
ఇందులో భాగంగా మాల్డోవా అధ్యక్షురాలితో భేటీ అయ్యారు. ఇరుదేశాల భేటీ అనంతరం దేశాధినేతలు కలిసి అధ్యక్ష నివాస ప్రాంగణంలో సరదాగా మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో అధ్యక్షురాలి శునకాన్ని ఆస్ట్రియా ప్రధాని దగ్గరకు తీసుకునే క్రమంలో అది కరిచింది. ఈ విషయాన్ని అక్కడి మీడియా వెల్లడించింది.
ఈ ఘటనపై ఆస్ట్రియా ప్రధాని సైతం ఇన్‌స్టా వేదికగా స్పందించారు. ఈ మేరకు ఓ పోస్ట్ పెట్టారు. తనకు పెంపుడు కుక్కలంటే ఎంతో ప్రేమని.. దాన్ని దగ్గరికి తీసుకున్నప్పుడు ఉత్సాహంతో ఆ శునకం అలా చేసి ఉండొచ్చని చెప్పుకొచ్చారు. కాగా, తన పెంపుడు శునకం కరవడంపై మాల్డోవా అధ్యక్షురాలు మైయా.. ఆస్ట్రియా ప్రధానికి క్షమాపణలు చెప్పారు.
ఇదివరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పెంపుడు శునకం ‘కమాండర్’ ఇటీవలే వైట్‌హౌస్‌లో భద్రతా సిబ్బందిని తరచూ కరిచి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఏకంగా సుమారు పది సార్లకు పైగా సిబ్బందిని కరవడంతో ఆ శునకాన్ని శ్వేతసౌధం నుంచి తరలించారు.